రజనీకాంత్‌‌కు తీరని అవమానం.. దొంగతనం కేసులో యువకుడి అరెస్ట్..

సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను అవమానించి వార్తల్లో నిలిచిన సంతోష్ అనే తమిళ కుర్రాడు దొంగతనం కేసులో కటకటాలు లెక్కిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం తూతుకుడి పట్టణాన్ని రజనీకాంత్ సందర్శించిన మరో ఇద్దరితో కలిసి రజనీకాంత్‌ను అనుచితంగా ద్వేషించడంతో సంతోష్ వార్తలెక్కాడు. అయితే తాజాగా సైకిల్ దొంగతనం చేసిన ఆ యువకుడిని పొలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..

నువ్వెవరు అంటూ నిలదీసి..

నువ్వెవరు అంటూ నిలదీసి..

2018లో తూతుకూడి పోలీస్ ఫైరింగ్ సందర్భంగా బాధితులను పరామర్శించేందుకు రజనీకాంత్ ఆ ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయంలో సంతోష్ అనే యువకుడు రజనీకాంత్‌ను పర్యటించకుండా అడ్డుకొన్నాడు. అంతేకాకుండా నువ్వెవరు? మమల్ని పరామర్శించడానికి అంటూ రజనీని నిలదీశాడు.

కాలా ప్రమోట్ చేసుకోవడానికే..

కాలా ప్రమోట్ చేసుకోవడానికే..

కాలా సినిమాను ప్రమోట్ చేసుకోవడానికే నీవు ఇక్కడికి వచ్చావు. ఇక్కడి బాధితుల గురించి నీకేం పట్టింపు లేదని సంతోష్ విమర్శలు గుప్పించాడు. మీకు సినిమాలే ముఖ్యమని, ఒకవేళ మీరు అడ్డుకొన్నా ముందుకు వెళితే కాలా సినిమాను ఆడనివ్వకుండా ఉద్యమిస్తాం అని హెచ్చరించాడు. దాంతో సంతోష్ మీడియా దృష్టిని ఆకర్షించాడు.

రజనీకాంత్ ముఖంపై..

రజనీకాంత్ ముఖంపై..

అయితే సంతోష్ మాటలకు కొంచెం కూడా నొచ్చుకొకుండా రజనీకాంత్ ముఖంపై చిరునవ్వుతో స్పందించాడు. నేను రజనీకాంత్‌ను అంటూ అప్యాయంగా సంతోష్‌కు సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అయినా ఆ సమయంలో రజనీని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. ఈ ఘటన స్టెరిలైట్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా చేపట్టిన 100 రోజుల నిరసన కార్యక్రమం సమయంలో జరిగింది.

సైకిల్ దొంగతనం చేసి

సైకిల్ దొంగతనం చేసి


కాగా, రజనీకాంత్‌ను ఎదురించిన యువకుడు సంతోష్ తాజాగా సైకిల్ దొంగతనం ఆరోపణలపై అరెస్ట్ అయ్యాడు. తన బైక్‌ను దొంగిలించాడని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పొలీసులు అదుపులోకి తీసుకొన్నారు. సంతోష్‌తోపాటు ముగ్గురిని అరెస్ట్ చేసి బైక్‌ను స్వాధీనం చేసుకొన్నారని మీడియా కథనాలు వెలువడ్డాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X