Rama Temple inauguration రజనీకాంత్‌కు అరుదైన గౌరవం.. అయోధ్య నుంచి రాములోరు పిలుపు!
భారతీయులందరూ అత్యంత దైవంగా భావించే అయోధ్య రామాలయం ప్రారంభ వేడుకను అట్టహాసంగా జరిపించేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ ప్రణాళికను సిద్దంగా చేసింది. ప్రాణ్ ప్రతిష్ట వేడుక పేరుతో జనవరి 22వ తేదీ 12.20 గంటలకు కనీవిని ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అక్షింతల పంపిణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమం జనవరి 15వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ క్రమంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఈ గౌరవం వివరాల్లోకి వెళితే..
రామాలయం ప్రారంభ వేడుకలకు ప్రధాని నరేంద్రమోదీతోపాటు విదేశాల్లోను, దేశవ్యాప్తంగా 7000 మంది అతిథులకు ఆహ్వాన లేఖలను అందజేశారు. ఈ వేడుకకు దాదాపు లక్షకుపైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

అయోధ్యలో జరిగే వేడుకల కోసం సూపర్ స్టార్ రజనీకాంత్‌ను బీజేపీ నేత రా అర్జునమూర్తి భేటీ అయ్యారు. మహోన్నత కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా, ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనాల్సిందని ఆహ్వాన లేఖను అందించారు. తైలవర్ రజనీకి ఆహ్వాన లేఖను అందిస్తూ దిగిన ఫోటోను రా అర్జునమూర్తి ట్విట్టర్‌లో షేర్ చేయగా వైరల్ అయింది.
రజనీకాంత్‌కు ఆహ్వాన లేఖను అందించిన తర్వాత రా అర్జున మూర్తి ట్వీట్ చేస్తూ.. నా జీవితంలో గొప్ప అనుభూతిని పొందాను. మా నేత రజనీకాంత్‌ను ఆయన నివాసంలో కలువడం చాలా సంతోషంగా ఉంది జనవరి 22వ తేదీన రాష్ట్రీయ స్వయం సేవక్ అధికారుల పర్యవేక్షణలో జరిగే అయోధ్య కుంభాభిషేకం కార్యక్రమానికి అయోధ్య రామ జన్మభూమి తీర్థ క్షేత్రం తరఫున ఆయన కుటుంబానికి ఆహ్వాన లేఖను అందజేయడం ఆనందంగా ఉంది అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

అయోధ్యలో జరిగే అద్బుతమైన వేడుకకు దేశవ్యాప్తంగా పారిశ్రామిక వేత్లు, క్రికెటర్లు, వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు హాజరుకానున్నారు. తమిళనాడు నుంచి పలువరిని ఈ వేడుకకు ఆహ్వానించారు.


Click it and Unblock the Notifications











