'పోకిరి' మహేష్ లా రజనీకాంత్ 'రోబో' ఫైట్
రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తూన్న 'రోబో' చిత్రం కోసం దర్శకుడు శంకర్ ఆ మధ్య ఓ సీన్ ని పూనే లో చిత్రీకరించారు. ఆ సీన్ సూపర్భ్ గా వచ్చిందని తెలుస్తోంది. కథ ప్రకారం రజనీకాంత్..రోబోగా, సైంటిస్ట్ గా కనిపిస్తారు. ఇప్పుడు ఈ సీన్ ప్రకారం రజనీకాంత్ రోబో..ఐశ్వర్యా రాయ్ ని వెంబడిస్తూంటుంది. ఆ రోబో పేరు చిట్టీ. అది పిచ్చిగా ఐశ్వర్యను ప్రేమిస్తూంటుంది. తనను తయారు చేసిన సైంటిస్ట్ రజనీకే పోటీగా తయారవుతుంది. ఓ రోజు ఐశ్వర్యా రాయ్ ట్రైన్ లో వెళ్తూంటుంది. ఆమె కోసం రజనీ రోబో...ప్లాట్ ఫారంపై వేచి చూస్తూంటాడు. ఇంతలో అప్పుడే వచ్చి ఆగిన ఆ ట్రైన్ లోకి కొంతమంది గూండాలు ట్రైన్ ఎక్కడం గమిస్తుంది. వాళ్ళు కంపార్టెమెంట్ లో ఎక్కి ఐశ్వర్యా రాయ్ ని అల్లరి పెట్టబోతూంటారు. అప్పుడు రజనీ రోబో కదులుతూ స్పీడు అందుకుంటున్న ట్రైన్ ని పట్టుకుని లోపలకి వస్తుంది. వాళ్ళను చితక్కొడుతుంది. పోకిరీలో మహేష్ లా ట్రైన్ లో వీరవిహారం చేసి అందరీ చావ చితక్కొడుతుంది. ఇంత రిస్కీ సీన్ ని శంకర్ వేరే డూప్ తో ప్లాన్ చేస్తే రజనీకాంత్ ఈ వయస్సులో కూడూ పట్టుపట్టి తానే స్వయంగా చేసారు. దాంతో అంతా షాక్ అయ్యారు.


Click it and Unblock the Notifications











