twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీకాంత్‌కు షాక్.. వందల కోట్లు చెల్లించాలి.. దిమ్మతిరిగే కేసు!

    By Rajababu
    |

    Recommended Video

    Kaala Movie Stuck In A New Controversy

    సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కాలా చిత్రం ఏ క్షణాన మొదలైందో ఏమో కానీ దానిని అనేక వివాదాలు చుట్టుముడుతున్నాయి. కబాలీ తర్వాత పా రంజిత్ రూపొందిస్తున్న ఈ చిత్రంపై ప్రారంభంలో పిటిషన్ దాఖలు కాగా, దానిని మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. తాజాగా కాలా చిత్రం విడుదలకు ముందు రజనీకాంత్‌పై దాదాపు 100 కోట్ల రూపాయల పరువునష్టం దావా పిటిషన్ దాఖలు కావడం సినీ వర్గాల్లో సంచలనంగా మారింది.

    ధారవిలో తమిళులకు గాడ్‌ఫాదర్‌గా

    ధారవిలో తమిళులకు గాడ్‌ఫాదర్‌గా

    ముంబైలోని అతిపెద్ద మురికివాడ పాత ధారవిలో ఒకప్పుడు తిరావియమ్ నాడర్ గాడ్‌ఫాదర్‌గా ఉండేవారు. ధారవిలోని తమిళ ప్రజల హక్కుల కోసం విస్తృతంగా పోరాడిన ఘనత ఆయయన పేరున ఉంది. ఆయనను గుడ్వాలా సేథ్ లేదా కాలా సేథ్ అని పిలిచేవారు.

    నా తండ్రి జీవిత కథను

    నా తండ్రి జీవిత కథను

    అయితే ఇప్పుడు తిరావియమ్ నాడర్ కుమారుడు జవహర్ నాడర్ సంచలన రీతిలో కేసు దాఖలు చేశారు. కాలా చిత్రంలోని కరికాలన్ పాత్ర తన తండ్రి తిరవావియమ్ జీవిత కథను స్ఫూర్తిగా తీసుకొని పాత్రను రూపొందించారు. కాలా చిత్రంలో నాడర్ కమ్యూనిటీని, తన తండ్రి ప్రతిష్ఠను దెబ్బ తీసే విధంగా చిత్రీకరించారని జవహర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

     101 కోట్ల మేరకు పరువునష్టం

    101 కోట్ల మేరకు పరువునష్టం

    తన తండ్రి, కమ్యూనిటీ ప్రతిష్ఠను దెబ్బ తీసే విధంగా చిత్రీకరించినందుకు గానూ రూ. 101 కోట్ల మేర పరువునష్టాన్ని చెల్లించాలని తన పిటిషన్‌లో జవహార్ కోర్టుకు విన్నవించారు. తాము డబ్బు కోసం పిటిషన్ దాఖలు చేయలేదు. దానిని మా హక్కుగా భావిస్తున్నాం.

     బేషరుతుగా క్షమాపణ

    బేషరుతుగా క్షమాపణ

    ఒకవేళ మా తండ్రి పాత్రను పాజిటివ్‌గా తెరకెక్కిస్తే.. అందుకు క్రెడిట్ ఇవ్వాలి. లేదా నా తండ్రి జీవిత కథను కించపరిస్తే బేషరతు క్షమాపణ చెప్పాలి. అందుకు మూల్యం కూడా చెల్లించాలి. 1957లో నా తండ్రి బతుకు తెరువు కోసం ముంబైకి వలస వెళ్లారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలోని తమిళులకు జరిగిన అన్యాయాన్ని ఎదురిస్తూ గాడ్‌ఫాదర్‌గా మారారు అని జవహర్ నాడర్ వెల్లడించారు.

    ముంబై నేర సమ్రాజ్యంలో

    ముంబై నేర సమ్రాజ్యంలో

    ముంబై నేర సమ్రాజ్యాన్ని శాసించిన హాజీ మస్తాన్, వరదరాజా ముదలియార్కి తిరావియమ్ నాడర్ అత్యంత సన్నిహితుడు. ఆయన 2003లో మరణించారు. గతంలో కూడా కాలా చిత్రం హాజీ మస్తాన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నదనే మాట వినిపించింది. తాజాగా తిరావియమ్ అంశం వెలుగులోకి రావడం మరింత చర్చనీయాంశమైంది.

    English summary
    Ever since Rajinikanth's Kaala went on floors, it has been facing several legal hassles. Earlier, director Pa Ranjith was accused of taking inspiration from Indian gangster and smuggler Haji Mastan's life. Later, the case was dismissed by the Madras High Court. He has sought Rs 101 crore as damages.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X