‘రజనీకాంత్ ఒక్కడే సూపర్‌స్టార్.. తలైవా ఒక్క ఫోన్ కాల్ చేస్తే సీఎంలే కాదు.. ప్రధాని కూడా’
ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కూలీ. తమిళంలో పాపులర్ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాసన్ తదితరులు నటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా చిత్రంలో రెబ్బా మోనికా జాన్, మలయాళ దర్శకుడు, నటుడు సౌబీన్ షాహిర్, జూనియర్ ఎంజీఆర్ తదితరులు నటిస్తున్నారు.
ఈ సినిమాకు గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫి, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వరిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్‌కు సిద్దమవుతున్న ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నైలో ఆగస్టు 2వ తేదీన కూలీ ఆన్ లీష్డ్ పేరుతో ఓ భారీ కార్యక్రమాన్ని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో అట్టహాసంగా నిర్వహించారు.

కూలీ ఆన్‌లీష్డ్ వేడుకలో రజనీకాంత్, నాగార్జున అక్కినేని, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబీన్ షాహిర్, పూజా హెగ్డే, రెబ్బా మోనికాజాన్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రిఫైయింగ్ మోడ్‌లో జరిగిన ఈ వేడుకలో తారల వెలుగు జిలుగుల మధ్య నిర్మాత కళానిధి మారన్ చేసిన ప్రసంగం వైరల్ మాత్రమే కాకుండా ట్రెండింగ్ అవుతున్నది.
కూలీ వేడుకలో కళానిధి మారన్ మాట్లాడుతూ.. నాగార్జున నాతో మాట్లాడుతూ రజనీకాంత్ గురించి ఓ మాట చెప్పాడు. రజనీ మాత్రమే ఒరిజినల్ సూపర్ స్టార్ అని అన్నాడు. కానీ నేను చెప్పేది ఏమిటంటే? ఆయన ఒక్కడే ఒరిజినల్ సూపర్ స్టార్ కాదు. ఆయన ఒక్కడే సూపర్ స్టార్. మరెవరూ లేరు అని అన్నారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలోని సక్సెస్‌పుల్ యాక్టర్లు యాటిట్యూడ్ చూపిస్తున్నారు. రెండు సినిమాలు హిట్ అయితే చాలాూ.. ఫోన్ కాల్ ఎత్తడం లేదు. సినిమా షూటింగుల కోసం ప్రైవేట్ జెట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ రజనీ సార్ చాలా సాధారణమైన వ్యక్తి, నిజాయితీతో కూడి వారు. అతడు మాత్రమే సూపర్ స్టార్ అని కళానిధి మారన్ సెటైర్లు వేశాడు.
రజనీకాంత్‌పై కళానిధి మారన్ ప్రశంసల వర్షం కురిపించారు. రజనీ ఒకవేళ ఇండియాలో ఏ రాష్ట్రానికి సీఎంకు ఫోన్ చేసినా.. విదేశాల్లో ఏ నేతకు ఫోన్ చేసినా వెంటనే కాల్ అటెండ్ చేస్తారు. కేవలం సీఎంలు మాత్రమే కాదు.. ప్రధాని కూడా ఫోన్ ఎత్తి మాట్లాడుతాడు. అందుకే ఆయన రియల్ సూపర్ స్టార్ అని కళానిధి మారన్ చెప్పారు.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గత 50 ఏళ్లలో ఎంతో మంది హీరోలు వచ్చారు.. వెళ్లిపోయారు. కానీ రజనీకాంత్ ఒక్కరే సూపర్ స్టార్‌గా నిలిచాడు. మిగిలిపోయాడు. జైలర్ సినిమాతో కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేశాడు. కానీ జైలర్ రికార్డులను కూలీ బ్రేక్ చేస్తుంది అని కళానిధి మారన్ తన అంచనాలను బయటపెట్టి ఫ్యాన్స్‌లో హుషారు పుట్టించారు.


Click it and Unblock the Notifications











