రజనీకాంత్ మరో సంచలనం.. భద్రత కావాలి.. ఇదిగో అందుకు సాక్ష్యం..

By Rajababu

రాజకీయ ప్రవేశంపై ఊగిసలాటలో ఉన్న సూపర్‌స్టార్ రజనీకాంత్ ఎట్టకేలకూ పెదవి విప్పనున్నారు. గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు పురచ్చి తలైవా తెరదించేందుకు ముందుకొస్తున్నాడు. డిసెంబర్ 26 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు అభిమానులతో సమావేశం కానున్నట్టు శుక్రవారం (డిసెంబర్ 15) రజనీకాంత్ తేల్చిపడేశారు. దాంతో ఫ్యాన్స్‌లో పండుగ వాతావరణం నెలకొన్నది. అయితే రాజకీయ రంగ ప్రవేశంపై ప్రకటన చేస్తారా లేక మళ్లీ అదే సస్పెన్స్ కొనసాగిస్తారా అనే విషయంపై వేచి చూడాలి అనే అభిప్రాయం పలు వర్గాల నుంచి వ్యక్తమవుతున్నది.

Recommended Video

Rajinikanth Fans Not Happy With 2.0 ఛీ..! రోబో 2.0 మరీ ఇంత చెత్తగానా?
 ఫ్యాన్స్‌కు నిరాశ

ఫ్యాన్స్‌కు నిరాశ

రజనీకాంత్ తీసుకొన్న తాజా నిర్ణయంతో నూతన సంవత్సరంలో తమిళ రాజకీయాలు కొత్త పుంఖలు తొక్కుతాయా అనే ప్రశ్న ఉదయించింది. డిసెంబర్ 12న తన జన్మదినాన్ని పురస్కరించుకొని రజనీకాంత్ ఎలాంటి ప్రకటన చేస్తారో అనే ఆశించిన వారికి నిరాశే ఎదురైంది.

 అభిమానులతో భేటీ

అభిమానులతో భేటీ

బర్త్ డే విషెష్ చెప్పడానికి వచ్చిన అభిమానులకు లాఠిఛార్జీ తప్పలేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రజనీకాంత్ అభిమానులతో భేటీ కానున్నారనే వార్త తమిళనాడులోని రాజకీయ, సినీ వర్గాల్లో సంచలనం రేపింది.

 భద్రత కావాలి..

భద్రత కావాలి..

అభిమానులతో భేటి ఉన్నందున్న భారీ భద్రతను ఏర్పాటు చేయాలని నగర కమిషనర్‌కు రజనీకాంత్ ఫ్యాన్స్ క్లబ్ అధ్యక్షుడు లేఖ రాయడం మరింత ఆసక్తిని పెంచింది. తన అభిమానుల గణం బల ప్రదర్శన చేస్తారా అనే సందేహం వ్యక్తమవుతున్నది. ఈ భేటికి భారీ ఎత్తున ఫ్యాన్స్ తరలివచ్చే అవకాశం ఉంది.

 పొలిటికల్ ఎంట్రీ తప్పదా?

పొలిటికల్ ఎంట్రీ తప్పదా?

ఎనిమిదేళ్ల తర్వాత రజనీకాంత్ ఈ ఏడాది ఆరంభంలో ఫ్యాన్స్‌తో భేటి అయ్యారు. అయితే అందులో సంచలన విషయాలు ఏమీ ప్రస్తావనకు రాలేదు. రాజకీయ రంగంలోకి వస్తే చూద్దామా అని ఎదురు చేసిన అభిమానులకు నిరాశే మిగిలింది. ప్రస్తుతం రాజకీయ ప్రవేశం అనివార్యం కావడం, తమిళనాట రాజకీయ స్తబ్దత ఏర్పడిన నేపథ్యంలో రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ తప్పనిసరిగా మారిందనే వాదన వినిపిస్తున్నది.

 రోబో2గా రానున్న రజనీ

రోబో2గా రానున్న రజనీ

ఇక సినిమాల విషయానికి వస్తే శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న రోబో2.0 చిత్రంలో రజనీకాంత్ నటించారు. ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ నటిస్తున్నారు. అంతేకాకుండా కబాలి దర్శకుడు పా రంజిత్ డైరెక్షన్‌లో కాల కరికాలన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో హ్యూమా ఖురేషి హీరోయిన్‌గా నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X