Jailer 2: జైలర్ 2 బ్లాస్ట్.. 1000 కోట్లు కొట్టే లెవెల్లో ఇదెక్కడి మాస్

మారుతున్న ట్రెండ్ తో పాటుగా మన సౌత్ సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ స్టార్స్ తమ పంథా మార్చి సినిమాలు చేస్తే వాటి తాలూకా వసూళ్లు ఏ రేంజ్ లో వస్తున్నాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మెయిన్ గా సీనియర్ హీరోస్ పనయ్యిపోయింది అని అనుకున్న చాలా మంది మళ్ళీ తమ కెరీర్ లో ఏజ్ కి తగ్గ సినిమాలు చేస్తే బాక్సాఫీస్ లు బ్లాస్ట్ అవుతాయి అని చూపించారు.

తమిళ సినిమా నుంచి ఉలగనయగన్ కమల్ హాసన్ మొదటగా తన విక్రమ్ తో చూపిస్తే ఆ తర్వాత దానికి మించిన బిగ్గెస్ట్ హిట్ కొట్టి సూపర్ స్టార్ రజినీకాంత్ తనకి తిరుగు లేదని మళ్ళీ చూపించారు. కాగా తమిళ నాట మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా రజినీకాంత్ కి మార్కెట్ గాని ఫాలోయింగ్ గాని వేరే లెవెల్లో ఉండేది. అయితే రజినీకాంత్ కూడా ఒక టైం లో ఫామ్ కోల్పోయారు అనే సమయంలో వచ్చింది "జైలర్" అనే సినిమా.

rajinikanth jailer 2 announcement teaser promising with sure shot 1000 cr

దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో చేసిన ఈ సినిమా సంచలన రన్ ని అందుకుంది. మళ్ళీ రజినికాంత్ స్టార్డంని చూపించి 600 కోట్లకి పైగా వసూళ్లు అందుకుంది. అందులో 100 కోట్లు గ్రాస్ మన తెలుగు సినిమా నుంచే రావడం విశేషం. అందుకే ఈ సినిమాకి సీక్వెల్ ని కూడా ఆడియెన్స్ డిమాండ్ చేశారు. మరి ఈ సినిమా అనౌన్సమెంట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్న తరుణంలో మేకర్స్ నేడు సంక్రాంతి కానుకగా భారీ అనౌన్సమెంట్ అని అందించారు.

కాగా ఇది కూడా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తన మార్క్ డార్క్ కామెడీ టైప్ లో అనౌన్సమెంట్ వీడియోగా సంగీత దర్శకుడు అనిరుద్ తో కలిసి అందించాడు. మరి ఆసక్తికరంగా ఇందులో మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ కలిపి చూపించడం అనేది ఊహించనిది అని చెప్పాలి. పార్ట్ 2 కావాల్సిన హైప్ ఏ రేంజ్ లో కావాలో అంతకు మించి డబుల్, ట్రిపుల్ లెవెల్లోనే ఇది ఉందని చెప్పి తీరాలి.

rajinikanth jailer 2 announcement teaser promising with sure shot 1000 cr

రజినీకాంత్ మాస్ ప్రెజెన్స్ దానికి తోడు అనిరుద్ బీట్స్ ఒక్కసారిగా అంచనాలు పెంచేసాయి. మరి లాస్ట్ టైం కొట్టిన జైలర్ థీమ్ స్కోర్ లకి మరింత ఎఫెక్టీవ్ బీట్స్ ని మిక్స్ చేసి కొట్టడంతో ఆ ఎలివేషన్ ఇంకా పీక్ లోకి వెళ్ళిపోయింది అంటున్నారు. దీనితో ఈ అనౌన్సమెంట్ వీడియో తోనే తమిళ సినిమా నుంచి మొట్ట మొదటి 1000 కోట్ల సినిమాగా ఇది తప్పకుండా నిలుస్తుంది అని ట్రేడ్ వర్గాలు ఇప్పుడు నుంచే చెప్పేస్తున్నారు.

మరి ఈ సెన్సేషనల్ సీక్వెల్ ఆ మార్క్ ని అందుకుంటుందో లేదో చూడాల్సిందే. అయితే ఈ సినిమాని కూడా సన్ పిక్చర్స్ వారే నిర్మాణం వహిస్తుండగా ఈ సినిమాలో కూడా గతంలో ఉన్న స్టార్స్ మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ లు ఉంటారో లేదో చూడాలి మరి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే మొదలు కానుంది. అలాగే లోకేష్ కనగరాజ్ తో "కూలీ" అనే సినిమా కూడా ఇపుడు రజిని చేస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Read more about: jailer 2 rajinikanth anirudh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X