రజనీకాంత్ ట్విట్టర్ ఎకౌంట్ తెరిచారు (వీడియో)
చెన్నై : రజనీ కాంత్ అభిమానులకు మరో శుభవార్త. ఆయన తాజాగా ట్విట్టర్ లో జాయిన్ అయ్యారు. ఇక కంటిన్యూగా తన వ్యక్తిగత విషయాలు, తన సినిమా విషయాలు గురించి ట్వీట్స్ ద్వారా ఫ్యాన్స్ కు అందుబాటులో ఉండనున్నారు. @SuperStarRajini అనే పేరుతో ట్విటర్ wdrf4లో అకౌంట్ తెరిచారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడిన వీడియో ప్రత్యేకంగా వన్ ఇండియా పాఠకులకు ప్రత్యేకం...
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/e7ElMJMeSJU?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>
ఆయన మాట్లాడుతూ... ట్విటర్ లో అకౌంట్ తెరువాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకునే విషయాలను ట్విటర్ ద్వారా తెలుసుకోవడం చాలా సులభం అని రజనీ అన్నారు. అంతేకాకుండా నా అభిమానులతో తన ఆలోచనలు, అనుభవాలను పంచుకోవడానికి సులభంగా కూడా ఉంటుందని రజనీ తెలిపారు.

రజనీకాంత్ నటించిన విక్రమ్ సింహా చిత్రం మే 9 తేదిన విడుదలకు సిద్ధమవుతోంది. భారత దేశపు తొలి ఫోటో రియలిస్టిక్ ఫెర్ఫార్మెన్స్ కాప్చర్ టెక్నాలజీతో రూపొందిన ఈ చిత్రానికి ఆయన కూతురు సౌందర్య ఆర్ అశ్విన్ దర్శకత్వం వహించారు. పెర్‌ఫార్మన్స్ మోషన్ క్యాప్చరింగ్ విధానంలో తెరకెక్కిన ఈ సినిమాలో రజనీ సరసన దీపికా పదుకొణే నటించింది. రజనీ కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించారు. సునీల్ లుల్ల నిర్మాత. ఎ.ఆర్.రెహమాన్ స్వరపరచిన పాటల్ని రీసెంట్ గా విడుదలయ్యాయి. 'రోబో' తర్వాత రజనీకాంత్ హీరోగా 'రాణా' చిత్రం తెరకెక్కాల్సింది. ఆయన అనారోగ్యానికి గురికావటంతో అది ఆగిపోయింది. తన చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో 'కోచ్చడయాన్'కు పచ్చజెండా వూపి అభిమానులను ఖుషీ చేశారు సూపర్‌స్టార్. సీనియర్ దర్శకుడు కేయస్ రవికుమార్ పర్యవేక్షణలో అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిందీ చిత్రం. ఇందులో రాణా, కోచ్చడయాన్‌గా రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేశారు. ఇప్పటికే ట్రైలర్ విడుదల చేశారు.
రజనీకాంత్ నటించిన చివరి చిత్రం 'రోబో' 2010లో విడుదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన సినిమా విడుదల కాలేదు. దీంతో అభిమానులు చాలా నిరాశగా ఉన్నారు. 'విక్రమ్ సింహా' చిత్రంలో రజనీకాంత్..రణధీరన్ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్ మీనన్ కెమెరా వర్క్ అందిస్తున్నారు. ఈచిత్రంలో రజనీకాంత్ లాంగ్ హెయిర్ తో శివున్ని పోలి ఉంటాడని, కత్తులతో పోరాటం చేసే యోధుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం విదితమే. భారతదేశంలోనే తొలిసారిగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతోన్న చిత్రం ఇదే కావడం గమనార్హం. ఏఆర్ రెహమాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











