జైల్ సెట్.... ఖైదీ గెటప్ లో రజనీకాంత్

By Srikanya

చెన్నై‌: పా.రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్న రజనీకాంత్ చిత్రం 'కబాలి'‌. రాధికా ఆప్టే హీరోయిన్ గా చేస్తోంది. కొన్ని రోజుల క్రితమే 'కబాలి' యూనిట్ షూటింగ్ నిమిత్తం మలేసియా వెళ్లింది. అక్కడ రజనీకాంత్‌కు మలేసియా అధికారవర్గాలు ఘనస్వాగతం పలికాయి. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. మలేసియాలోని మలాక్కా ప్రాంతంలో భారీ సెట్‌లు వేశారు.

ఇందులో ఓ జైలు సెట్‌ కూడా ఉంది. అందులో ఖైదీగా ఉన్న రజనీకాంత్‌కు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత ఫైట్ సీన్స్ చిత్రీకరించనున్నారు. చిత్రీకరణలో ఉన్న రజనీకాంత్‌ను చూసేందుకు మలేసియాలోని భారతీయులు వస్తున్నారు. ఆయనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

వారికోసం రజనీకాంత్‌ సాయంత్రం సమయం కేటాయించినట్లు తెలుస్తోంది. మలేసియాలో 'కబాలి'లోని 75 శాతం సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు రజనీకాంత్‌ తన సన్నిహిత వర్గాలతో చెప్పారు. అక్కడ 60 రోజుల పాటు చిత్రీకరణ ఉంటుంది.

Rajinikanth Kabali shooting, Huge Jail set is erected

ఇక మలేషియాలో రజినీకాంత్‌ను చూడడానికి ప్రజలు ఎంతో ఆతృతగా ఆయన కారు చుట్టూ గుమికూడారు. అనంతరం అభిమానులకు రజినీ అభివాదం చేశారు.

ఈ సందర్భంగా రజనికాంత్ కుమార్తె సౌందర్య అభిమానులతో తీసిన ఓ చిత్రాన్ని ట్విట్టర్‌ ద్వారా అభిమానులకు పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను సూపర్‌ స్టార్‌ కుమార్తె సౌందర్య తన అధికారిక ట్విట్టర్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 995లో ఇండియాలో రజినీకాంత్‌... 2015 మలేషియా అంటూ ఫొటోలో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X