రజనీకాంత్-కమల్ హాసన్ కాంబినేషన్!
చెన్నయ్: సూపర్ స్టార్ రజనీకాంత్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కాంబినేషన్లో గతంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. త్వరలో ఈ ఇద్దరు స్టార్స్ కలిసి నటించబోతున్నానరే వార్తలు కోలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి.
చెన్నయ్ నుంచి అందిన సమాచారం ప్రకారం ఏవిఎం శరవణన్ ఈ ఇద్దరు స్టార్లతో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఇటీవల నిర్మాత శరవణన్, కమల్ హాసన్ ప్రొడ్యూసర్ నివాసంలో భేటీ అయ్యారని...ఈ క్రమంలో రజనీ, కమల్ కాంబినేషన్ సినిమా ప్రస్తావనకు వచ్చిందిన తెలుస్తోంది.
ఈ విషయమై శరవణన్ మాట్లాడుతూ...ఈ ఇద్దరి కాంబినేషన్ కేవలం కె. బాలచందర్ వల్లనే సాధ్యం. ఈ ఇద్దరు స్టార్లకు గురువు ఆయన. ఆయన వల్లే వాళ్లు ఈ స్థాయికి వచ్చారు. వాళ్ల ఇద్దరితో సంయుక్తంగా ఆయన గతంలో చాలా చిత్రాలు రూపొందించారు అని చెప్పుకొచ్చారు.
రజనీ, కమల్ కాంబినేషన్ ఐడియాపై బాలచందర్ కుమార్తె పుష్పా కందస్వామి ఆనందం వ్యక్తం చేసింది. అయితే తన తండ్రి ప్రస్తుతానికి వీరుతో సినిమా చేయాలనే ఆలోచనలో మాత్రం లేరని వెల్లడించారు. ఏది ఏమైనా వీరి కాంబినేషన్లో సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది కాబట్టి త్వరలోనే అదని నిజం కావాలని ఆశిద్దాం.
ప్రస్తుతం రజనకాంత్ తన కూతురు సౌందర్య దర్శకత్వంలో 'కొచ్చాడయాన్' చిత్రంలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. కమల్ హాసన్ తన తాజా సినిమా 'విశ్వరూపం' విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు, ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











