కె బాలచందర్ డైరెక్షన్ లో కలిసి నటిస్తున్నసూపర్ స్టార్స్...!
తమిళ ఇండస్ట్రీకి రెండు పిల్లర్స్ లాంటి వారు ఎవరబ్బా అంటే ఒకరు రజనీకాంత్, రెండవ వారు కమల్ హాసన్ అంటారు తమిళ తంబీలు. తమిళనాట వీరిద్దరికీ అంత క్రేజ్ ఉంది. అలాంటి ఈ స్టార్స్ హీరోస్ ఇద్దరూ కలసి నటిస్తే ఇక తమిళ నాట ప్రభంజనమే...చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత తమిళ సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల హాసన్ కలిసి నటిస్తున్నారని సమాచారం. అయితే, ఇది సినిమాలో మాత్రం కాదు. ఓ డాక్యుమెంటరీ ఫిలిం లో వీళ్ళిద్దరూ నటిస్తున్నారు. ఇలా వీళ్లని కలుపుతున్న క్రెడిట్ వాళ్ల సినిమా గురువు కె.బాలచందర్ కి దక్కుతుంది. తమిళ సినిమా రంగంలోని ఉద్యోగుల కోసం పయోనీర్ హౌసింగ్ సొసైటీ, రెసిడెంన్సియల్ టౌన్షిప్ ఈ డాక్యుమెంటరీని నిర్మిస్తోంది.
బాలచందర్ అడగడం వల్ల ఈ స్టార్లు కాదనలేక ఒప్పుకున్నారు. త్వరలో దీని షూటింగ్ ప్రారంభమవుతుంది. తొలి షాట్ ను వీరిద్దరిపైనా బాలచందరే తీస్తారట. ఈ వంకనైనా తమ అభిమాన నటులు కలిసి నటిస్తున్నందుకు తమిళ తంబీలు తెగ ఆనందపడిపోతున్నారు. వీళ్లిద్దరూ తమ కెరీర్ మొదలు పెట్టిన, తొలి నాళ్లలో చాలా సినిమాలు(అపూర్వ రాగంగల్, వయసు పిలిచింది, అంతులేని కథ మొ..) కలిసి నటించారు. మళ్లీ ఎంతమంది ట్రై చేసినా వీళ్లని కలపడం కుదరలేదు!


Click it and Unblock the Notifications











