మాట నిలబెట్టుకోవడంలో రజనీకాంత్ ఫెయిల్!
వివరాల్లోకి వెళితే....
ప్రస్తుతం రజనీకాంత్ 'కొచ్చాడయాన్' అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు కె.ఎస్. రవికుమార్ పర్యవేక్షణలో రజనీ చిన్న కుమార్తె సౌందర్య డైరెక్ట్ చేస్తుండగా...ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నాడు. రోబో తర్వాత రజనీ 'రాణా' చిత్రాన్ని మొదలు పెట్టారు. ఆ చిత్రం ప్రారంభోత్సవం రోజు ఆయన అనారోగ్యానికి గురి కావడం సినిమా అటకెక్కింది. చాలా రోజుల గ్యాప్ తర్వాత రజనీ మళ్లీ తన కూతురు సౌందర్య దర్శకత్వంలో 'కొచ్చాడయాన్' సినిమా చేస్తున్నారు.
రజనీకాంత్ నటించిన చివరి చిత్రం 'రోబో' 2010లో విడుదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన సినిమా విడుదల కాలేదు. దీంతో అభిమానులు చాలా నిరాశగా ఉన్నారు. ఈ విషయాన్ని గ్రహించిన రజనీకాంత్, దర్శకురాలు సౌందర్య 'కొచ్చాడయాన్' చిత్రాన్ని ఈ దీపావళికి విడుదల చేస్తామని అభిమానులకు మాటిచ్చారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే వాళ్లు మాట నిలబెట్టుకునేలా కనిపించడం లేదు. సినిమా షూటింగ్ ఇంకా సగం కూడా పూర్తి కాలేదు. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా చాలా పెండింగులో ఉంది. ఈ నేపథ్యంలో కొచ్చాడయాన్ చిత్రం ఈ సంవత్సరం విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
ఈ చిత్రంలో రజనీకాంత్..రణధీరన్ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్ మీనన్ కెమెరా వర్క్ అందించనున్నారు. ఈచిత్రంలో రజనీకాంత్ లాంగ్ హెయిర్ తో శివున్ని పోలి ఉంటాడని, కత్తులతో పోరాటం చేసే యోధుడిగా కనిపించనున్నాడు.


Click it and Unblock the Notifications












