Rajinikanth: అర్ధరాత్రి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చిన తలైవా.. లాల్ సలామ్ అంటూ నెవ్వర్ బిఫోర్ స్టిల్
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో లాల్ సలామ్ అనే మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా దీనిని తెరకెక్కిస్తున్స్తున్నారు. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో జైలర్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసిన రజినీకాంత్ ఇప్పుడు కంప్లీట్ గా ఐశ్వర్య కోసం డేట్స్ కేటాయించారు.
సూపర్ స్టార్ కూడా ప్రస్తుతం సీనియర్, స్టార్ దర్శకులతో కాకుండా యంగ్ జెనరేషన్ టాలెంటెడ్ దర్శకులని తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం ఎంపిక చేసుకుంటున్నారు. ఐశ్వర్య రజినీకాంత్ తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. అలాగే తెలుగులో దిల్ రాజు ప్రొడక్షన్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమా ఉంటుందనే ప్రచారం నడుస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కిస్తున్న లాల్ సలామ్ మూవీ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఆవిష్కరించారు. ముస్లిం లీడర్ గా సూపర్ స్టార్ ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు అర్ధం అవుతోంది. మోయిద్దీన్ భాయ్ అనే పాత్రని రజిని చేస్తున్నట్లు రివీల్ చేశారు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ పోస్టర్ బట్టి చూస్తూ ఉంటే ముంబై అల్లర్లు, హిందూ, ముస్లిం మత ఘర్షణల నేపథ్యంలో ఐశ్వర్య రజినీకాంత్ సినిమాని అవిష్కరిస్తూ ఉన్నట్లు టాక్ వస్తోంది. కంటెంట్ పరంగా చూసుకుంటే ఆమె ఈ సారి కాస్తా సెన్సిటివ్ ఎలిమెంట్స్ ను టచ్ చేయబోతున్నట్లు అర్థమవుతోంది. ఇక దానిని తెరపై ఎలా చూపిస్తారు అనేది తెలియాల్సి ఉంది.
రజినీకాంత్ కూడా ఈ చిత్రాన్ని చాలా నమ్మకంతో చేస్తున్నట్లు ఉంది. హెల్త్ సహకరించకున్న కూడా ఈ మధ్య రజిని వరుస సినిమాలని లైన్ లో పెట్టేస్తూ పూర్తి చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక లాల్ సలామ్ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తూ ఉండగా లైకా ప్రొడక్షన్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్లానింగ్ జరుగుతుందని సమాచారం.


Click it and Unblock the Notifications











