గుండెను పిండేసింది.. నయనతారపై రజనీకాంత్ సీరియస్ కామెంట్స్..

సూపర్‌స్టార్ రజనీకాంత్ సాధారణంగా ఏ అంశంపైనైనా ఆచీతూచీ స్పందిస్తుంటారు. ఎవరైనా మంచి పనిచేసినా.. లేదా ఏదైనా గొప్పగా చిత్రం రూపొందించినా ఏ మాత్రం తడబాటు లేకుండా నిక్కచ్చిగా తన అభిప్రాయం చెబుతుంటారు.

By Rajababu

Recommended Video

నయనతారపై రజనీకాంత్ సీరియస్ కామెంట్స్

సూపర్‌స్టార్ రజనీకాంత్ సాధారణంగా ఏ అంశంపైనైనా ఆచీతూచీ స్పందిస్తుంటారు. ఎవరైనా మంచి పనిచేసినా.. లేదా ఏదైనా గొప్పగా చిత్రం రూపొందించినా ఏ మాత్రం తడబాటు లేకుండా నిక్కచ్చిగా తన అభిప్రాయం చెబుతుంటారు. తాజాగా నయనతారపై, ఆమె నటించిన అరమ్ చిత్రంపై రజనీకాంత్ ప్రశంసల జల్లు కురిపించారు. నయనతార నటించిన అరమ్ చిత్రం తమిళనాట విడుదలై విజయ ఢంకా మోగిస్తున్నది. అరమ్ చిత్రాన్ని చూసిన అనంతరం నయనతార నటనకు రజనీకాంత్ కితాబిచ్చారు.

 కలెక్టర్ పాత్రలో నయనతార..

కలెక్టర్ పాత్రలో నయనతార..

దేశ వ్యవస్థలో ఉన్న అవకతవకాలు, విధానాల లోపాలపై సినీ విమర్శనాస్త్రం సంధిస్తూ వచ్చిన చిత్రం ఆరమ్. ఈ చిత్రంలో నయనతార కలెక్టర్ పాత్రను పోషించారు. లోతైన బావిలో పడిన ఓ బాలిక ఉదంతం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రజా సమస్యలపై అధికారులు, రాజకీయ నేతల పనితీరును ప్రశ్నించే చిత్రంగా రూపొందింది.

 అరమ్ గుండెను పిండేసింది

అరమ్ గుండెను పిండేసింది

ఆరమ్ రిలీజ్ తర్వాత ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తున్న నేపథ్యంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ప్రత్యేకంగా సినిమాను చూపించారు. అనంతరం రజనీ మీడియాతో మాట్లాడుతూ.. అరమ్ చిత్రం నా గుండెను పిండేసింది. నయనతార నటన అద్భుతంగా ఉంది. భావోద్వేగాలను దట్టించి సినిమాను రూపొందించిన చిత్ర యూనిట్‌కు అభినందనలు అని అన్నారు.

 కష్టానికి ఫలితం దక్కింది..

కష్టానికి ఫలితం దక్కింది..

అరమ్ చిత్రంపై రజనీకాంత్ ప్రశంసలు కురిపించడంతో చిత్ర యూనిట్ సంతోషంలో మునిగి తేలుతున్నది. తాము పడిన కష్టానికి నిజంగా ఫలితం దక్కింది. రజనీ ప్రశంస మరిన్ని మంచి చిత్రాల రూపకల్పనకు స్ఫూర్తిగా నిలుస్తుంది అని దర్శకుడు గోపి నైనార్ అన్నారు.

 నయనతార దూకుడుకు భేష్

నయనతార దూకుడుకు భేష్

దూకుడును ప్రదర్శించే కలెక్టర్ పాత్రలో నయనతార కనిపించారు. ఓ గ్రామంలో జీవన్మరణ సమస్యగా మారిన ఓ సంఘటనను డీల్ చేసే పాత్రలో ఆమె జీవించారు. నయనతారకు ఉన్న ఇమేజ్‌ను సక్సెస్‌ఫుల్‌గా ఉపయోగించుకోవాలన్న మా విజన్‌ వర్కవట్ అయింది. కొత్త అవతారంలో నయనతారను చూసి థ్రిల్ అవుతున్నారు. కథ చెప్పినప్పుడే కలెక్టర్ పాత్రలో తాను ఎలా ఉండాలి అనే విషయాన్ని తనకు వివరించింది. ఈ సినిమాలో ఆమె ఇన్వాల్వ్‌మెంట్ చాలా అద్భుతం అని గోపి నైనార్ చెప్పారు.

 అరమ్2 సీక్వెల్ సిద్ధం

అరమ్2 సీక్వెల్ సిద్ధం

అరమ్ చిత్రానికి రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాం. అరమ్2 మరింత పవర్‌ఫుల్ కథతో త్వరలో వస్తుంది. అరమ్2లో నయనతార మళ్లీ కనిపిస్తుంది. తొలుత ఈ చిత్రం కలెక్షన్లు మామూలుగా ఉన్నప్పటికీ.. మౌత్ టాక్‌తో ఈ సినిమా పుంజుకున్నది. అరమ్ మంచి కలెక్షన్లు సాధిస్తున్నది.

 నయనతార ప్రమోషన్ అదుర్స్

నయనతార ప్రమోషన్ అదుర్స్

కలెక్టర్‌గా కొత్త అవతారంలో కనిపించిన నయనతార.. ప్రస్తుతం సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. చీరకట్టుతో కలెక్టర్ గెటప్‌లో థియేటర్ల సందర్శనకు నయనతార వెళ్లి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. నయనతార ప్రమోషన్‌తో అరమ్ చిత్రానికి కొత్త ఊపు వస్తున్నది అని ట్రేడ్ అనలిస్టులు పేర్కొంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X