దర్బార్ నుంచి మరో లీక్.. ఈ సారి రజినీకాంత్
గతంలో లాగా లేవు నేటి పరిస్థితులు. డిజిటల్ మీడియా అందుబాటులోకి రావడం, టెక్నాలజీ విస్తృతమవుతుండటం కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా మూవీ మేకర్స్‌కి ఇదో తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. సినిమా అలా విడుదల కాగానే సోషల్ మీడియాలో పైరసీ ప్రత్యక్షమవటం, షూటింగ్ సమయంలో స్పాట్‌లో తీసిన ఫొటోలు లీక్ కావటం ఫిలిం మేకర్స్‌ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ కోవలోనే తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా సినిమా 'దర్బార్' నుంచి రజినీ లుక్ లీక్ అయింది.
దర్బార్ సెట్స్ నుంచి ఇలా ఫోటోలు లీక్ కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా రజినీకాంత్, నయనతార లకు సంబందించిన లుక్స్ సోషల్ మీడియాలో దర్శకనమిచ్చి ఆ సినిమా దర్శకనిర్మాతలకు షాకిచ్చాయి. ఇక తాజాగా మరోసారి రజినీ లుక్ లీక్ కావడంపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు ఆ చిత్ర నిర్మాతలు. ఎంతో డబ్బు వెచ్చించి సినిమా చేస్తుంటే ఇలా లీకులు జరుగుతుండటం అసంతృత్తికి లోను చేస్తుందని అంటున్నారు.

ఇక తాజాగా లీకైన రజినీ లుక్ గురించి చెప్పుకుంటే.. ఆయన పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో ఎంతో హుందాగా కనిపిస్తున్నారు. నది ఒడ్డున పోలీస్ డ్రెస్‌లో అలా నడుకుంటూ వస్తున్నట్లుగా ఉంది ఈ లుక్. గడ్డం, స్టైలిష్ హెయిర్‌తో యంగ్ లుక్ లో కనిపిస్తున్నాడు రజినీకాంత్. ప్రస్తుతం ఈ ఫోటో సిసిల మీడియాలో వైరల్‌గా మారింది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది దర్బార్ మూవీ. ఈ చిత్రంలో రజినీకాంత్ సరసన నయనతార, నివేద థామస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సునీల్ శెట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. రానున్న సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.


Click it and Unblock the Notifications











