Coolie: కూలీలో అతిథిపాత్రతో కమల్ హాసన్ ఎంట్రీ.. హింట్ ఇచ్చిన రజనీకాంత్

ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కూలీ. తమిళంలో పాపులర్ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాసన్ తదితరులు నటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా చిత్రంలో రెబ్బా మోనికా జాన్, మలయాళ దర్శకుడు, నటుడు సౌబీన్ షాహిర్, జూనియర్ ఎంజీఆర్ తదితరులు నటిస్తున్నారు.

ఈ సినిమాకు గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫి, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వరిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్‌కు సిద్దమవుతున్న ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నైలో ఆగస్టు 2వ తేదీన కూలీ ఆన్ లీష్డ్ పేరుతో ఓ భారీ కార్యక్రమాన్ని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో అట్టహాసంగా నిర్వహించారు.

Rajinikanth Leaks Kamal Haasan surprise entry

కూలీ ఆన్‌లీష్డ్ వేడుకలో రజనీకాంత్, నాగార్జున అక్కినేని, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబీన్ షాహిర్, పూజా హెగ్డే, రెబ్బా మోనికాజాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో రజనీకాంత్ స్పీచ్ ట్రెండింగ్ అవుతున్నది. ఈవెంట్‌లో మాట్లాడుతూ.. చాలా ఆసక్తికరమైన విషయాలువ వెల్లడించారు. లోకేష్‌తో జరిగిన ఓ సంభాషణ గురించి రజనీ కాంత్ చెబుతూ..

డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ నా వద్దకు కథ చెప్పడానికి వచ్చినప్పుడు.. నేను కమల్ హాసన్ ఫ్యాన్‌ను సార్ అని చెప్పాడు. నా కెందుకు చెప్పాడో ముందుగా అర్ధం కాలేదు. లోకేష్‌ను నేను అడగలేదే? నేను నిన్ను అడిగానా? నాకు ఆ విషయం ఎందుకు చెప్పావు అంటూ రజనీకాంత్ వేదికపై నుంచి అడిగాడు. ఆ తర్వాత ఈ మూవీలో నీకు పంచ్ డైలాగ్స్ ఉండవు. అలాంటి స్కోప్ లేని కథ ఇది. ఇది ఇంటెలిజెంట్ స్టోరి అని చెప్పాడు తెలిపారు.

ఆ తర్వాత నాతో మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాగార్జున అక్కినేని, ఉపేంద్ర, అమీర్ ఖాన్ కాకుండా మరో సర్‌ప్రైజ్ కేమియో ఉంటుంది అని చెప్పాడు. దాంతో ఈయన కమల్ హాసన్ ఫ్యాన్ కదా.. ఆయనను కన్విన్స్ చేసి ఈ సినిమాలో గెస్ట్ ఎంట్రీ ప్లాన్ చేసి ఉంటాడని అనుకొన్నాను అని రజనీకాంత్ ఆడియో లాంచ్ వేడుకలో వెల్లడించారు.

అయితే ఇదే వేడుకలో లోకేష్ కనకరాజ్ మాట్లాడుతూ.. నేను కమల్ ఫ్యాన్‌ను అని రజనీ సార్‌కు చెప్పినప్పుడు.. ఆయన ఏమీ మాట్లాడలేదు. కానీ సినిమా షూటింగ్ అంతా ముగిసి.. డబ్బింగ్ వర్క్ మొదలైనప్పుడు ఆయన నాతో మాట్లాడుతూ.. నేను కూడా కమల్ ఫ్యాన్‌ను అని చెప్పి నన్ను సర్‌ప్రైజ్ చేశాడు. అయితే ఈ సినిమాలో కమల్ హాసన్ కెమియో అదే.. అతిథి పాత్రలో కనిపిస్తారనే విషయంపై ఊహగానాలు భారీగా సోషల్ మీడియాలో మొదలయ్యాయి. సినిమా రిలీజ్ అయితే గానీ.. కమల్ ఎంట్రీ ఉంటుందా? లేదా? అనేది కచ్చితంగా చెప్పలేం అని సినీ వర్గాలు వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X