007 గా రజనీకాంత్... డిటేల్స్

By Srikanya

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ని ఇప్పుడు 007 అని పిలుస్తున్నారు. దానికి కారణం...హాలీవుడ్ జేమ్స్‌బాండ్ 007 చిత్రాలు తెరకెక్కే స్టూడియోలో ప్రస్తుతం కోచ్చడయాన్ రజనీకాంత్ యమా బిజీగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రతిష్ఠాత్మక ఆ స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటున్న తొలి దక్షిణాది చిత్రం ఇదే కావడంతో అంతా గొప్పగా చెప్పుకుంటున్నారు. అందుకే రజనీకాంత్‌ను అందరూ 007 అని పిలుస్తున్నారని తమిళ మీడియా కథనాలు రాసుకొచ్చింది. రజనీకాంత్ కుమార్తె సౌందర్య దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం కోచ్చడయాన్. షూటింగ్‌లో పాల్గొనడం కోసం ఆయన గత వారం చెన్నై నుంచి లండన్ వెళ్లారు. దీపావళికి ఈ సినిమా విడుదలవుతుందని ఈ సందర్భంగా రజనీకాంత్ ప్రకటించారు.

ప్రస్తుతం లండన్‌లో ఉన్న ఫైన్‌వుడ్ స్టూడియోలో కోచ్చడైయాన్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ స్టూడియోలోనే జేమ్స్ బాండ్ - 007 చిత్రం షూటింగ్ జరిగింది. దీంతో రజనీకాంత్‌ను అక్కడి ప్రముఖులు 007గా ప్రస్తావిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన దీపికా పదుకొణే నటిస్తోంది. ఈ చిత్రానికి ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. శరత్‌కుమార్‌, స్నేహ, ఆది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్ సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నారు. ఈ మేరకు ఆయన కూతురు సౌందర్య తన ట్విట్టర్ లో ఓ ఫోటోని పెట్టి పోస్ట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X