రజనీ కాంత్ కి నిర్మాత కావలెను!!!

కుశేలన్ వల్ల భారీ స్ధాయిలో నష్టపోయామనీ,రజనీకాంత్ సినిమా అని చెప్పడం వల్లే భారీ మొత్తాలకు కొనుగోలు చేసామని తమిళనాడులోని ధియోటర్ యజమానులు కొద్ది రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి డిమాండులో మెయిన్ గా తమకొచ్చిన నష్టంలో 70 శాతం నిర్మాతలే భరించాలంటున్నారు. అయితే తమిళ చిత్రం నిర్మాతలు మాత్రం 30 శాతం మాత్రమే భర్తీ చేస్తామని చెప్పినట్లు సమాచారం. రజనీకాంత్ ఆ నష్టాన్ని ఇంకొంత తగ్గించేందుకు ఓ చిత్రాన్ని చేసే అవకాశాలున్నాయి.
ఇప్పటికే ఆయన శంకర్ దర్శకత్వంలో రూపొందే రొబో లో నటించేందుకు కాల్షీట్లు ఇచ్చారు. ఐష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కి సంభందించిన ఫొటో షూట్ కూడా అమెరికాలో చేసారని చెప్పుకుంటున్నారు. సాంకేతికంగా ఎన్నో హంగులతో కూడిన ఈ చిత్రం జనం ముందుకొచ్చేందుకు సమయం ఎక్కువ పట్టే అవకాశాలున్నాయి.
ఇక ఈ చిత్రమే కాకుండే సుల్తాన్ అనే యానిమేషన్ చిత్రం కూడా రజనీ రూపురేఖలతో కూడుకున్నదే. ఈ మేరకు ఆయన హైదరాబాద్ లో జరిగిన షూటింగ్ లో పాల్గొన్నారు. సుల్తాన్ ఈ యేడాది చివర్లో విడుదలఅయ్యే అవకాశాలున్నాయి. అయితే ఈ ప్రయోగాత్మక యానిమేషన్ సినిమా ఆయన అభిమానులను ఎంత వరకూ అవరిస్తుందనే అనుమానం అందరిలో ఉంది.
దాంతో ఈ రెండింటితో సంభంధం లేకుండా 2009 వేసవిలో విడుదలఅయ్యేలా ఓ చిత్రంలో నటించాలన్న ఆలోచనలో రజనీ ఉన్నారని కోలీవుడ్ సమాచారం. దీని ద్వారా కుశేలన్ వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవాలనుకుంటున్నారు. ఈ సినిమా పూర్తి స్ధాయి రజనీ మార్కులో మాస్ ఎలిమెంట్స్ తో ఉండే అవకాశాలున్నాయి. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉండాలని మంచి కథ,న్యాయం చేయగల దర్శకుడు కోసం ఆయన ఎదురుచూస్తున్నారు.
ఇక ఓ దశలో గజనీ,స్టాలిన్ చిత్రాల దర్శకుడు మురుగదాస్ పేరు కూడా ఇప్పుడు పరిశీలనలోకి వచ్చిందని చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన హిందీ గజనీ హడావిడిలో ఉన్నారు. కాబట్టి మరో దర్శకుడు కోసం అన్వేషణ సాగుతోందిట. అలాగే ఆయనతో 80 ల్లో సినిమాలు తీసిన ప్రముఖ నిర్మాత పంజు అరుణాచంలానికి నిర్మాణ భాధ్యతలు అప్పగించే అవకాశాలు కూడా ఉన్నాయట.
అయితే రజనీ ఏం చేస్తారన్నది ఇంకా అఫీషియల్ న్యూస్ వెలబడాల్సి ఉంది. ఇక అరుణాచలం కాకపోతే మరొకరు సీన్లోకి వచ్చినా ఆ నిర్మాత రిలీజ్ కి ముందు,తర్వాత వచ్చే సమస్యలును అన్నింటినీ ఫేస్ చేయాలినేది మొదట కండీషన్ ట. తన పేరు చెప్పుకుని మార్కెట్ చేసుకునే వారు తన పేరుతో సినిమా కొనుక్కునే వారి లాభ,నష్టాలకు కూడా భాధ్యత వహించాలనేది ఆయన అసలు ఆలోచనట.


Click it and Unblock the Notifications











