దీపికాను ‘రానా’ హీరో ఇప్పుడు రమన్నా వచ్చేస్తుందట...
ప్రస్తుతం సింగపూర్ లో రెస్ట్ తీసుకుంటున్న రజనీకాంత్ త్వరలోనే ఇండియా వచ్చి 'రానా" షూటింగ్ లో పాల్గొంటారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్ లో ప్రారంభమయ్యే అవకాశాలు వున్నాయి. దీనికి సంబంధించిన రజనీకాంత్ ఎప్పటిక్ప్పుడు డైరెక్టర్ కె ఎస్ రవికుమార్ తో ఫోన్ లో డిస్కస్ చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఏ స్టేజ్ లో వుందో అడిగి తెలుసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఇందులో హీరోయిన్ గా నటించబోతున్న దీపికా పదుకొనేకి రజనీ ఫోన్ చేసి సెప్టెంబర్ లో షూటింగ్ ప్రారంభమవుతుందని, డేట్స్ ఎడ్జస్ట్ చేసుకొని షూటింగ్ కి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేశారట. రజనీ నుంచి ఫోన్ కాల్ అందుకున్న దీపికా చాలా ఎక్సైట్ అయిందట. ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేసినా వస్తానని, ఈ సినిమా విషయంలో తన ఫుల్ కో ఆపరేషన్ వుంటుందని ఆ విషయం ఆలోచించకుండా రెస్ట్ తీసుకోవాల్సిందిగా దీపికా రజనీని కోరిందట.


Click it and Unblock the Notifications











