అభిమానిని ఆనందపరచిన రజనీకాంత్!
ఇండియాలో సూపర్ స్టార్ గా వెలుగొందిన హీరో రజనీకాంత్. అంతే కాదు ఎదుగుతున్న కొద్ది ఒదుగుతూనే ఉండే హీరో రజనీ అదే ఆయన సూపర్ స్టార్ అవడానికి నిదర్శనం. ఎంత బిజీగా ఉన్నా ఆయనకు సమయం దొరికినప్పుడల్లా తన అభిమానులతో మాట్లాడుతూ వారిని సంతోషపెడుతూ ఉంటారు రజినీ. ప్రస్తుతం కొంత మంది అభిమాను కొరకు ఇల్లు కూడా కట్టిస్తున్నారన్న విషయం తెలిసిందే.
ఈ మధ్య నటుడు విజయ్ వసంత్ చెన్నైలోని పెళ్లి వేడుకకు రజినీ హాజరయ్యారు. తమ ఆరాద్య నటుడు రజనీ ఆడిటోరియంలో నడుచుకుంటూ వెళుతుంటే రజనీ తమ మధ్యే ఉడటంతో చూసేందుకు అభిమానులు ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు వచ్చేసారట. ఈ తోపులాటలో ఓ అభిమాని అదుపు తప్పి కింద పడిపోయాడట. అది గమనిస్తున్న రజనీ అభిమాని దగ్గరికెళ్లి చేయిచ్చి పైకి లేపారంట. ఇంత మంది జనం ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారట.
దాంతో ఆ అభిమాని సూపర్ స్టార్ రజనీ చేయి ఇచ్చినందున ఇది కళ నిజమా నమ్మలేకపోతున్నాను అని ఒక్క క్షణం ఏం చేయాలో తెలియక జీవితంలో రజనీని దూరం నుండైనా ఒక్కసారి చూస్తే చాలు అనుకున్న ఆ అభిమానికి ఆనందంతో మాటలు రాలేదు. నా కళ నిజమైంది నేను రజనీ గారి ని చూసేశాను, మాట్లాడాను అను బిగ్గరగా అరిచేసి తన సంతోషాన్ని అందరితోనూ పంచుకొన్నాడట. గుంపులో గోవింద అన్నట్టు కూడా తన అభిమానిని పట్టించుకున్న రజనీకాంత్, ఇతర అభిమానులను కూడా ముచ్చట పడేట్టు చేసింది.


Click it and Unblock the Notifications











