రజనీకాంత్‌కు మళ్లీ అనారోగ్యం, ఆందోళనలో ఫ్యాన్స్!

గోవాలోని పనాజీలో నవంబర్ 20న జరిగే IFFI-2013 ప్రారంభోత్సవ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా ఆహ్వానించేందుకు నిర్వాహకులు రజనీకాంత్ వద్దకు వెళ్లారు. అప్పుడే వారికి రజనీకాంత్ అనారోగ్యం విషయం తెలిసినట్లు తెలుస్తోంది. రజనీకాంత్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు.
గతంలోనూ రజనీకాంత్ తీవ్రమైన అనారోగ్యానికి గురవడంతో పాటు విదేశాల్లో చికిత్స తీసుకున్నారు. అనారోగ్యం కారణంగా ఆయన చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. తాజాగా రజనీకాంత్ అనరోగ్యం బారిన పడ్డారనే విషయం తెలియగానే అభిమానుల్లో ఆందోళన మొదలైంది.
కాగా...రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన 'కొచ్చాడయాన్' చిత్రం డిసెంబర్ 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈచిత్రానికి రజనీకాంత్ కూతురు సౌందర్య దర్శకత్వం వహించారు. అత్యాధునిక టెక్నాలజీతో హాలీవుడ్ ప్రమాణాలతో ఈచిత్రాన్ని తెరకెక్కించారు.


Click it and Unblock the Notifications











