న్యూఇయర్ డే: ఫ్యాన్స్‌ను కలిసిన రజనీకాంత్
చెన్నై: సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ నూతన సంవత్సరం సందర్భంగా చెన్నైలోని తన పోయెస్ గార్డెన్స్ లో అభిమానులను కలిసారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సంవత్సరం అందరికీ మంచి జరుగాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా పలువురు ఫ్యాన్స్ ఆయనకు గ్రీటింగ్స్ తెలియజేసారు.
రజనీకాంత్ సినిమాల విషయానికొస్తే...ఆయన ఇటీవల నటించిన ‘లింగా' చిత్రం బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆడలేదు. ఆయన తర్వాతి సినిమా ఇంకా ఖరారు కాలేదు. 2015 సంవత్సరంలో ఆయన వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

కాగా...‘కొచ్చాడయాన్' సినిమాకు సంబంధించిన సమస్య రజనీ ఫ్యామిలీని ఇబ్బంది పెడుతోంది. 22.21కోట్ల రూపాయలను చెల్లించాల్సిందిగా రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్‌కు ఎగ్జిమ్ బ్యాంక్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ రుణాన్ని చెల్లించని కారణంగా లతా రజనీకాంత్‌కు చెందిన రెండెకరాల ఆస్తిని ఎగ్జిమ్ బ్యాంకు జప్తు చేసుకున్నట్లుగా కూడా కథనాలు వచ్చాయి. తమకు సహకరించాలన్న ఉద్దేశంతోనే ఈ రుణానికి లతా రజనీకాంత్ గ్యారంటర్‌గా వున్నారని సంస్థ డైరెక్టర్ తెలిపారు.
‘కోచ్చడయాన్' చిత్రం కోసం మీడియా వన్ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ రుణం తీసుకుంది. చిత్రం నిర్మాణం కోసం ఎగ్జిమ్ బ్యాంకునుంచి తీసుకున్న 20కోట్ల రూపాయల రుణాన్ని మార్చినాటికి చెల్లిస్తామని చిత్ర నిర్మాతలు మంగళవారం స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications