సూపర్ స్టార్ ని చూసి నివ్వెరపోయిన వివాదాల హీరోయిన్....!?

By Sindhu

ఆశ్చర్యం, ఆనందం.. రెండూ ఒకేసారి కలిగే సంఘటనలు అప్పుడప్పుడూ జరుగుతుంటాయి. అవి జీవితాంతం గుర్తుండిపోతాయి. ఇటీవల నయనతారకు అలాంటి అనుభవమే ఎదురయ్యింది. ఇటీవల ఆమె ఓ 'శారీ షాప్"కి సంబంధించిన వాణిజ్య ప్రకటనలో నటించారు. ఈ చిత్రీకరణ చెన్నయ్‌ లోని కేలంపాఖంలో జరిగింది. షూటింగ్ జరుగుతున్నప్పుడు హఠాత్తుగా యూనిట్ అంతా కంగారు పడటం నయనతార దృష్టిని ఆకర్షించింది. ఉన్నట్టుండి ఎందుకలా హైరానా పడుతున్నారో అర్థం కాక నయనతార వెనక్కి తిరిగి చూశారట. అంతే.. ఆమె కూడా కంగారుపడిపోయారు. ఆ వెంటనే ఆశ్చర్యానందాలలో మునిగిపోయారు. కారణం.. రజనీకాంత్ కన్పించారు.

నయనతార షూటింగ్ చేస్తున్న ఆ 'షాపింగ్ మాల్"కి ఏదో పని మీద రజనీకాంత్ వెళ్లారట. నయనతార అదే మాల్‌ లో ఉన్న సంగతి తెలుసుకుని ఆమెను పలకరించడానికి షూటింగ్ స్పాట్‌ లోకి అడుగుపెట్టారు. ఆయన సరసన నయనతార 'చంద్రముఖి", 'కుశేలన్"లో నటించిన విషయం విదితమే. నయనతార ప్రవర్తన, ఆమె ప్రతిభ పట్ల రజనీకాంత్‌ కు మంచి అభిప్రాయం ఉంది. నయనతారను కలిసి 'ఆరోగ్యం బాగుందా? కుశలమే కదా" అని అడిగి రజనీకాంత్ వెనుతిరిగారట.

సూపర్ స్టార్ వెళ్లిపోయిన తర్వాత నయనతారతో పాటు ఇతర యూనిట్ సభ్యులు రజనీకాంత్ నిరాడంబతరను కొనియాడకుండా ఉండలేకపోయారని సమాచారం. మాములుగా ఇండియన్ హీరోలు ఓ లెవల్ మెయిన్‌ టైన్ చేస్తారనే అభిప్రాయం చాలామందికి ఉంటుంది. హీరోయిన్‌ ని స్వయంగా వెళ్లి పలకరిస్తే తమ రేంజ్ తగ్గుతుందన్న అభిప్రాయం కొంతమంది హీరోలకు ఉంది. రజనీకాంత్ మాత్రం తన స్థాయిని దృష్టిలో పెట్టుకోకుండా నయనతారను కలిసి, ఆత్మీయంగా పలకరించి వెళ్లడం అభినందించదగ్గ విషయం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X