అదే జరిగితే ప్రశాంతంగా చనిపోతా: ‘కాలా’ ఆడియో వేడుకలో రజనీకాంత్

By Bojja Kumar

Recommended Video

Kaala Audio Launch కాల ఆడియో లాంచ్ లో ఆసక్తిగా మారిన రజిని స్పీచ్

రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కాలా' మూవీ ఆడియో వేడుక చెన్నైలో బుధవారం సాయంత్రం గ్రాండ్ గా జరిగింది. గత కొన్నేళ్లుగా రజనీకాంత్ సినిమాలకు సంబంధించిన సినిమా ఫంక్షన్లు వివిధ కారణాలతో భారీ ఎత్తున జరుగలేదు. చాలా కాలం తర్వాత ఈ సారి 'కాలా' ఆడియో వేడుక భారీ ఎత్తున నిర్వహించారు ఈ చిత్ర నిర్మాత ధనుష్. ఈ వేడుకకు సినీ ప్రముఖులతో పాటు వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. ఈ వేడుకలో అభిమానుల ఉద్దేశించి రజనీకాంత్ సుధీర్ఘ ప్రసంగం ఇచ్చారు.

నాకు యాక్టింగ్ తప్ప మరేమీ తెలియదు

నాకు యాక్టింగ్ తప్ప మరేమీ తెలియదు

ఇది ఆడియో ఫంక్షన్ మాదిరి లేదు. మీ అందరినీ చూస్తుందే ఇది సక్సెస్ మీట్ లా అనిపిస్తోంది. యంతిరన్(రోబో) సినిమా సమయంలో నా ఆరోగ్యం బాగోలేక పోవడం వల్ల ఆసక్సెస్ మీట్ సెలబ్రేట్ చేసుకోలేక పోయాం. నీ మనసును, బాడీ హెల్దీగా ఉంచుకుంటే త్వరలోనే కోలుకుంటావు అని అపుడు కొందరు చెప్పారు. కానీ నాకు యాక్టింగ్ తప్ప మరేమీ దెలియదు అని వారికి చెప్పాను.... అని రజనీ వ్యాఖ్యానించారు.

అదే జరిగితే ప్రశాంతంగా చనిపోతా

అదే జరిగితే ప్రశాంతంగా చనిపోతా

తర్వాత కొచ్చాడియాన్ సినిమా చేశాను. దానికి బడ్జెట్ భారీగా ఖర్చయింది. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత నేను ఒకటే రియలైజ్ అయ్యాను. అపుడే డిసైడ్ అయ్యాను స్మార్ట్ గా ఉండే వారితో కాకుండా ఇంటిజెంట్ పీపుల్ తో పని చేయాలని. ఆ తర్వాత ‘లింగా' మూవీ కెఎస్ రవికుమార్ తో చేశాను. నాకు ఆ సినిమా కథ చాలా బాగా నచ్చింది. ఇది నీటి కొరత గురించి తీసిన సినిమా. నా డ్రీమ్ ఒకటే... సౌతిండియా నదులన్నింటినీ అనుసంధానం చేసి ఒక్కటిగా చేయాలని. అది జరిగితే నేను ప్రశాంతంగా చనిపోతాను. కానీ అది మనం ఊహించిన విధంగా జరుగుతుందని అనుకోవడం లేదు అని రజనీ అన్నారు.

ఈ వయసులో రొమాన్స్ చేయాలనుకోవడం లేదు

ఈ వయసులో రొమాన్స్ చేయాలనుకోవడం లేదు

ఇపుడు నా వయసు 65 సంవత్సరాలు. ఈ సమయంలో నాకంటే సగం వయసు ఉన్న అమ్మాయిలతో నేను రొమాన్స్ చేయకూడదు. అందుకే ‘కాలా' సినిమాలో అలాంటివి చేయలేదు... అని రజనీకాంత్ తెలిపారు.

అపుడు రజనీ పని అయిపోయిందన్నారు

అపుడు రజనీ పని అయిపోయిందన్నారు

చాలా కాలం క్రితమే రజనీ పని అయిపోయిందని కొంత మంది అన్నారు. కానీ వారు 40 ఏళ్లుగా ఆ విషయం చెబుతూనే ఉన్నారు. ఆ దేవుడి దయ, అభిమానుల ఆశీర్వాదంతో ఇంకా పరుగెడుతూనే ఉన్నాను. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా నేను చేయాలనుకున్నది చేస్తూనే వెళుతున్నాను. వయసుకు తగిన పాత్రలు చేయాలని నిర్ణయించుకున్నాను. అపుడే రంజిత్ పరిచయం అయ్యాడు. కబాలి సినిమా చేశాను అని తెలిపారు.

పొలిటికల్ మూవీ చేయాలనుకోవడం లేదు

పొలిటికల్ మూవీ చేయాలనుకోవడం లేదు

ఈ మధ్య వెట్రిమారన్ ఒక మంచి కథ చెప్పాడు. కానీ పూర్తిగా పొలిటికల్ మూవీ. అలాంటి సినిమా నేను చేయాలనుకోవడం లేదు. అందుకే మళ్లీ రంజిత్ కు ఫోన్ చేశాను. కాలా మూవీలో రాజకీయాలు ఉంటాయి కానీ అది పొలిటికల్ మూవీ కాదు... అని రజనీ తెలిపారు.

రంజిత్ లాంటి వ్యక్తిని ఇప్పటి వరకు చూడలేదు

రంజిత్ లాంటి వ్యక్తిని ఇప్పటి వరకు చూడలేదు

ముంబైలో ధారావి ప్రాంతంలో తమిళులు ఎక్కువగా ఉంటారు. ఆ నేపథ్యంలో సినిమా చేయాలనుకున్నాం. రంజిత్ మూడు నెలలు ముంబైలో ఉండి అక్కడ రీసెర్చ్ చేసి కాలా కథతో వచ్చాడు. కబాలి అనేది పూర్తిగా రంజిత్ సినిమా, కానీ ‘కాలా' మా ఇద్దరి సినిమా. రంజిత్ కేవలం దర్శకుడిగా తన జీవితం ముగించడు. అతడు అంత స్వార్థపరుడు కాదు. అతడి కమ్యూనిటీకి, తన చుట్టూ ఉండే ప్రతి ఒక్కరికీ ఏదైనా చేయాలనుకుంటున్నాడు. ఈ వయసులో ఇంత డీప్ గా ఆలోచించే వ్యక్తిని నేను ఇప్పటి వరకు చూడలేదు.

నానా పాటేకర్ పవర్‌ఫుల్ విలన్

నానా పాటేకర్ పవర్‌ఫుల్ విలన్

‘భాషా'లో ఆంటోని, ‘అరుణాచలం'లో నీలాంబరి ఎంత పాపులర్ విలన్స్ అయ్యారో.... అదే స్థాయిలో ‘కాలా'లో నానా పాటేకర్ విలన్ రోల్ ఉంటుంది. ఇది చాలా డిఫరెంట్ ఫిల్మ్, ఇది తప్పకుండా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను అని రజనీకాంత్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X