రజనీకాంత్‌ తర్వాతి సినిమా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో?

రజనీకాంత్ హీరోగా ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో 'పెట్ట' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ తమిళ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే దీని తర్వాత రజనీకాంత్ చేయబోయే మూవీ కూడా ఇదే సంస్థ నిర్మించబోతోందని, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఈ చిత్రం ఉంటుందని టాక్.

పలు హిట్ చిత్రాలు అందించి ఏఆర్ మురుగదాస్ ఇటీవల రజనీకాంత్‌కు కథ చెప్పారని, సూపర్ స్టార్ నుండి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న 'సర్కార్' చిత్రాన్ని సైతం సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Rajinikanth next movie with AR Murugadoss

'సర్కార్' చిత్రాన్ని దిపావళి సందర్భంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా విడుదల తర్వాత ఏఆర్ మురుగదాస్.. రజనీకాంత్ మూవీపై పూర్తి ఫోకస్ పెడతారని తెలుస్తోంది. 2019 జనవరిలో రజనీ-మురుగదాస్ సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

సన్ పిక్చర్స్ సంస్థ గతంలో రజనీకాంత్ హీరోగా 'రోబో' లాంటి భారీ చిత్రాలను నిర్మించింది. తర్వాత కొన్నేళ్ల పాటు సన్ పిక్చర్స్ సంస్థలో పెద్దగా సినిమాలు నిర్మాణం కాలేదు. ఈ ఏడాది నుండి ఈ సంస్థ కార్యకలాపాలు జోరందుకున్నాయి.

మరో వైపు రజనీకాంత్ కూడా తన సినిమాల జోరు పెంచారు. కాలా, 2.0, ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేస్తున్న 'పెట్ట', దీని తర్వాత మురుగదాస్ ప్రాజెక్ట్. తమిళనాడు ఎన్నికలకు ముందే వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంలో రజనీకాంత్ ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X