రంగం దర్శకుడితో రజనీకాంత్?

By Bojja Kumar

రంగం చిత్ర దర్శకుడు కేవీ ఆనంద్ త్వరలో రజనీకాంత్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఈ విషయమై కే వి ఆనంద్ ని అడుగగా అయన మౌనం పాటించారు. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా రానుందనే ఊహాగానాలకు బలం చేకూరినట్లయింది. త్వరలోనే ఈ విషయమై అధికారిక సమాచారం వెలువడే అవకాశం ఉంది. కేవీ ఆనంద్ ప్రస్తుతం సూర్య మరియు కాజల్ ప్రధాన పాత్రలలో “మాట్రన్" అనే చిత్రం చేస్తున్నారు.

రజనీకాంత్ తమిళంలో 'కొచ్చాడయాన్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం మొత్తం 80 కెమెరాలను ఉపయోగిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా హాలీవుడ్ మూవీ అవతార్ తరహాలో మోషన్ కాప్చర్ టెక్నాలజీతో 3డి ఫార్మాట్‌లో ....ఇండియాలో ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భారీ మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఈచిత్రంలో రజనీకాంత్ సరసన దీపిక పడుకొనె నటిస్తోంది. ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రోబో తర్వాత రజనీ 'రాణా' చిత్రాన్ని మొదలు పెట్టారు. ఆ చిత్రం ప్రారంభోత్సవం రోజు ఆయన అనారోగ్యానికి గురి కావడం సినిమా అటకెక్కింది. చాలా రోజుల గ్యాప్ తర్వాత రజనీ మళ్లీ తన కూతురు సౌందర్య దర్శకత్వంలో 'కొచ్చాడయాన్' సినిమా చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X