‘రాణా’విషయంలో సూపర్ స్టార్ నో కాప్రమైజ్...
'రోబో" సినిమా కోసం భారీ బడ్జెట్ ప్లాన్ చేశాడు ఎన్ శంకర్ ఆ సినిమా ప్రారంభానికి ముందే. సినిమా కోసం వాడిన గ్రాఫిక్స్ కి జనం జేజేలు పలికారంటే, పెట్టిన ప్రతి పైసా వర్కవుట్ అయినట్టే. వందకోట్లకు అటూ ఇటుగా 'రోబో" సినిమా కోసం శంకర్ ఖర్చు చేశాడు. సినిమా హిట్టయ్యింది కాబట్టి సరిపోయిందిగానీ, తేడా వస్తే, ఇంకేమన్నా వుందా..?'రోబో" సంగతి పక్కన పెడితే, 'రోబో"ని చూసి 'రాణా" సినిమాకి భారీ బడ్జెట్ ఎక్కువ వుండాలన్నది కెఎస్ రవికుమార్ ఆలోచన అట. ఈ విషయమై కేఎస్ రవికుమార్ తో, రజనీ విభేదించాడంటూ కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. టెక్నికల్ గా అద్భుతంగా వుండాలంటే ఆ మాత్రం తప్పదని కేఎస్ రవికుమార్, రిస్కేమోనని రజనీకాంత్..వెరసి బడ్జెట్ విషయమై ఇద్దరి మద్యా చిన్నపాటి విభేదాలు కూడా తలెత్తాయని సమాచారం.
కాగా, కేఎస్ రవికుమార్ తో వాదించడం వల్ల లాభం లేదనుకున్నాడో ఏమోగానీ, 'తేడా వస్తే నేనున్నానుగా" అంటూ బయ్యర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు అప్పుడే భరోసా ఇచ్చేస్తున్నాడట రజనీకాంత్. అయితే ఇవన్నీ గాలివార్తలు మాత్రమేననీ, బడ్జెట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని దర్శకుడు కెఎస్ రవికుమార్ తనపై వస్తోన్న గాసిప్స్ ని కొట్టిపారేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











