సూపర్ స్టార్ రజనీకాంత్ అందులో నటించలేదంట....
ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్ హిందీ చిత్రంలో నటించబోతున్నారు. కొద్ది రోజులుగా బాలీవుడ్ లో ఇదే చర్చ. యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించే 'ధూమ్ 3"లో రజనీ నటించబోతున్నారని చెప్పుకొన్నారు. దీనిపై యశ్ రాజ్ ప్రతినిధులు వివరణ ఇచ్చారు. రజనీ తమ చిత్రంలో నటించట్లేదని స్పష్టం చేశారు. ఆ సంస్థకి చెందిన రఫీఖ్ మాట్లాడుతూ 'ధూమ్-3"లో ఓ ప్రత్యేక పాత్ర కోసం మేం రజనీని కలిసినట్టు ఆయన కూడా ఇందులో నటిస్తానన్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. మాకు ఆయనంటే ఎంతో గౌరవం ఉంది. అందుకే వివరణ ఇస్తున్నాం. ప్రస్తుతం 'ధూమ్ 3"కి సంబంధించిన స్క్రిప్ట్ పనులు సాగుతున్నాయి. నటీనటుల గురించి ఇంకా ఎలాంటి సంప్రదింపులు సాగించడం లేదు. కథ పూర్తయ్యాక తారాగణాన్ని ఎంపిక చేయాలనుకుంటున్నామన్నారు.
రజనీకాంత్ రోబో ధూమ్ 3 యశ్ రాజ్ రఫీఖ్ ఐశ్వర్య రాయ్ శంకర్ rajinikanth robo dhoom 3 yash raj rafik aishwarya rai shankar


Click it and Unblock the Notifications