సీనియర్ దర్శకుడిని లైన్ లో పెట్టిన రజనీకాంత్.. ప్లాప్ ఇచ్చినా కూడా మళ్లీ అతనితోనే..
కొంతమంది దర్శకులు మొదట్లో జయాపజయాలను లెక్క చేయకుండా సినిమాలు చేస్తుంటారు. అయితే విజయాలు వచ్చినంత వరకు బాగానే ఉంటుంది కానీ. డిజాస్టర్ డోస్ ఎక్కువైతే మాత్రం అవకాశాలు ఎంత ప్రయత్నం చేసినా కూడా రావు. ఇక ప్లాప్స్ తో సతమతమవుతున్న తమిళ అగ్ర దర్శకుల్లో కెఎస్.రవికుమార్ ఒకరు. సౌత్ ఇండస్ట్రీలో దాదాపు అగ్ర హిరోలందరితో ఆయన వర్క్ చేశారు.
ముఖ్యంగా రజనీకాంత్ తో ముత్తు, నరసింహా వంటి బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నారు. కమల్ హాసన్ తో తెనాలి, దశావతారం వంటి సినిమాలు చేశాడు. ఇక జనరేషన్స్ మారుతున్న టారువత ఆయన మళ్ళీ కమర్షియల్ ఫార్మట్ లోనే ఎక్కువగా సినిమాలు తీయడంతో అపజయాలు ఎదురయ్యాయి. లింగా సినిమా దారుణంగా దెబ్బ కొట్టింది. ఆ మధ్య బాలకృష్ణతో జై సింహా సినిమాతో పరవాలేదు అనిపించారు. కానీ వెంటనే రులర్ తో మళ్ళీ దెబ్బ పడింది.

ఇక ఆయన ఫోకస్ మొత్తం ఇప్పుడు రజనీకాంత్ వైపే ఉంది. రజినీకాంత్ కెరీర్ లోనే బెస్ట్ హిట్స్ లలో కె.ఎస్.రవికుమార్ వి కుడా ఉన్నాయి. అందుకే తలైవా కూడా అతను ఎప్పుడు కథ చెప్పడానికి వచ్చినా కూడా నో చెప్పడం లేదు. ఇక లింగా తరువాత వీరి కాంబినేషన్ లో రానా అనే సినిమా రానున్నట్లు టాక్ వచ్చింది. కానీ అది వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు దర్శకుడు మళ్ళీ తలైవా వద్దకు అదే కథను తీసుకెళ్లి కాస్త మార్పులు చేసి చెప్పడంతో పాజిటివ్ గా స్పందించినట్లు సమాచారం. త్వరలోనే ఆయనతో సినిమా ఉంటుందని కూడా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు రవికుమార్.


Click it and Unblock the Notifications











