రజని కుమార్తె రెండో వివాహం.. మొదటి శుభలేఖ ఎవరికంటే, ఎలాంటి గూడుపుఠాణి లేదు!

సూపర్ స్టార్ రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్ రెండో వివాహానికి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది నిశ్చితార్థం కూడా జరిగింది. ప్రముఖ నటుడు, వ్యాపారవేత్త అయిన విశాగన్ వనంగమూడిని సౌందర్య రెండో వివాహం చేసుకోబోతోంది. ఫిబ్రవరి 11న జరగబోయే వీరి వివాహానికి ఏర్పాట్లు చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం సౌందర్య రజినీకాంత్ పెళ్ళికి సంబందించిన దుస్తులు కొనుగోలు చేస్తూ షాపింగ్ మాల్స్ లో కనిపించారు. వివాహానికి తక్కువ సమయం ఉండడంతో రజని స్వయంగా రంగంలోకి దిగి ప్రముఖుల్ని ఆహ్వానిస్తున్నారు.

 మొదటి శుభలేఖ

మొదటి శుభలేఖ

రజనీకాంత్ స్వయంగా సినీ రాజకీయ ప్రముఖుల నివాసాలకు వెళ్లి ఆహ్వానిస్తున్నారు. తన కుమార్తె పెళ్లి మొదటి శుభలేఖని రజనీకాంత్ తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరునావక్కరాసన్ కు అందించారు. మొదటి శుభలేఖ ఆయనకే ఇవ్వడానికి గల కారణాలని రజని వివరించారు. నా కుమార్తె పెళ్లి ఏర్పాట్లన్నీ ఆయనే చేస్తున్నారు. అందుకే వారికే మొదటి శుభలేఖ ఇవ్వడం భావ్యం అనిపించి ఆహ్వానించినట్లు రజని తెలిపారు.

 గూడుపుఠాణి లేదు

గూడుపుఠాణి లేదు

ఈ నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా చాలా మంది రాజకీయ ప్రముఖుల్ని కలసిన రజని వారిని తన కుమార్తె వివాహానికి ఆహ్వానించారు. ఈనేపథ్యంలో రజని మీడియాతో మాట్లాడుతూ.. నేను ప్రస్తుతం రాజకీయ నాయకులని కలుస్తున్నది నా కుమర్తె పెళ్ళికి ఆహ్వానించడానికే. ఇందులో ఎలాంటి రాజకీయం, గూడుపుఠాణి లేదు. దయచేసి ఈ విషయంలో రాజకీయ అంశాలతో ముడిపెట్టవద్దు అని రజని అన్నారు.

ప్రభుని కలసి

ప్రభుని కలసి

రజనీకాంత్ ప్రముఖ నటుడు ప్రభు నివాసానికి వెళ్లారు. తన కుమార్తె వివాహానికి హాజరు కావాలని కోరి శుభలేఖ అందించారు. ఈ సందర్భంగా రజనీకాంత్ తో కలసి దిగిన ఫోటోలని ప్రభు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రభు కుమారుడు విక్రమ్ ప్రభు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. వీరి స్నేహాన్ని చూస్తుంటే ముచ్చటేస్తోంది అని రజని, ప్రభు కలసి ఉన్నా ఫొటోని షేర్ చేశాడు.

విభేదాలతో

విభేదాలతో

ఇక సౌందర్య రజనీకాంత్ 2010లో అశ్విన్ అనే వ్యాపార వేత్తని వివాహం చేసుకుంది. విభేదాల కారణంగా 2017లో ఈ జంట విడిపోయారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం విషగన్ అనే నటుడితో రెండో వివాహానికి సిద్ధం అవుతోంది. చెన్నైలోని స్టార్ హోటల్ లో ఫిబ్రవరి 11న ఘనంగా వివాహ వేడుక జరగబోతోంది. వివాహం అనంతరం రిసెప్షన్ ని కూడా పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X