'పేట' ట్రైలర్: కుర్రాడిలా రజిని.. రౌడీలు ,తుపాకులు, హీరోయిన్లు రచ్చ రచ్చ!
Recommended Video

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం పేట. ప్రతిభగల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. రజనీకాంత్ మునుపటిలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు, చాలా రోజుల తర్వాత రజిని ఫుల్ జోష్ లో నటిస్తున్న చిత్రం ఇది. క్రేజీ హీరోయిన్ త్రిష, సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ ఈ చిత్రంలో రజనితో రోమాన్స్ చేస్తుండడం విశేషం. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. దానిపై ఓ లుక్కేద్దాం.

కుర్రాడిలా రజని
రజనీకాంత్ ఇటీవల తన వయసుకు సరిపడే పాత్రలే చేస్తున్నారు. కబాలి, కాలా చిత్రాలు ఆ కోవకు చెందినవే. కానీ ఈ చిత్రంలో రజనీకాంత్ గెటప్ చూస్తుంటే 30 ఏళ్ల కుర్రాడిలా పాత రజనీని చోస్తున్నట్లు ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రజనీని స్టైలిష్ గా చూపించి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రం విషయంలో సాధించిన తొలి సక్సెస్ అని చెప్పొచ్చు.

మసాలా ఎలిమెంట్స్
రజనీకాంత్ సినిమా అంటే అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. వారిని సంతృప్తి పరచాలంటే మాస్ ఎలిమెంట్స్ తప్పకుండా ఉండాలి. కార్తీక్ సుబ్బరాజ్ కుడా అదే ఫార్ములాని ఫాలో అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రజని పాత్ర ఎంటర్ టైనింగ్ గా ఉంటూనే యాక్షన్ ఎలిమెంట్స్ కు కావలసిన సెటప్ అంతా కార్తీక్ సుబ్బరాజ్ సిద్దం చేశారు.
హీరోయిన్లతో రోమాన్స్
ఈ చిత్రంలో త్రిష, సిమ్రాన్ లతో రజనీకాంత్ నటించే సన్నివేశాలు ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. రజని ఈ చిత్రంలో ప్రొఫెసర్ పాత్రలో కనిపిస్తున్నారు. మరో వైపు యంగ్ హీరోయిన్ మెఘా అకాష్, విజయ్ సేతుపతి, నవజుద్దిన్ సిద్దిఖి లాంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

సంక్రాంతికే ఖరారు
ఈ చిత్ర విడుదల సంక్రాంతికి ఉండబోతోందని చిత్ర యూనిట్ ట్రైలర్ ద్వారా ఖరారు చేసింది. జనవరి 10 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాని ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ఇంకా విడుదల చేయకపోవడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ చిత్రం తెలుగులో విడుదల కావడం సందిగ్డంగానే ఉంది. పైగా తెలుగులో సంక్రాంతికి భారీ చిత్రాలు విడుదల కాబోతున్నాయి.


Click it and Unblock the Notifications











