రజనీకాంత్..దేవుడా?

By Bojja Kumar

చెన్నయ్ : సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ఆయన అభిమానులు దేవుడిగా కొలుస్తారనే విషయం తెలిసిందే. రజనీ అంటే వాళ్లకు అంత అభిమానం. ఇలా అభిమానులతో నీరాజనాలు అందుకుంటున్న రజనీకాంత్ త్వరలో వెండి తెరపై దేవుడి రూపంలో కనిపింబోతున్నాడు.

హిందీలో మిథున్ చక్రవర్తి, పరేష్ రావల్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర దారులుగా 'OMG- ఓ మై గాడ్' చిత్రం రూపొందుతోంది. ఈచిత్రాన్ని ధనుష్ హీరోగా తమిళంలో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సౌత్ ఫిల్మ్ మేకర్ కృష్ణ ప్రసాధ్ ఈచిత్రం హక్కులు కొనుగోలు చేసే పనిలో ఉన్నారు. సినిమాపై అంచనాలు పెంచేందుకు ఈచిత్రంలో రజనీకాంత్‌ను దేవుడి పాత్రలో చూపించబోతున్నారట.

ఆ సంగతి పక్కన పెడితే...ప్రస్తుతం రజనీకాంత్ 'కొచ్చాడయాన్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రజనీకాంత్..రణధీరన్‌ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్‌ మీనన్‌ కెమెరా వర్క్ అందిస్తున్నారు. ఈచిత్రంలో రజనీకాంత్ లాంగ్ హెయిర్ తో శివున్ని పోలి ఉంటాడని, కత్తులతో పోరాటం చేసే యోధుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది.

దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం విదితమే. భారతదేశంలోనే తొలిసారిగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతోన్న చిత్రం ఇదే కావడం గమనార్హం. ఏఆర్ రెహమాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తెలుగులోనూ ఈచిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం రజనీకాంత్ పుట్టిన రోజును పురస్కరించుకుని 12.12.12న విడుదలవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X