సూపర్ స్టార్ సినిమా డైలాగ్ కన్నా రియల్ లైఫ్ డైలాగ్ పవర్ ఫుల్...
తానింకా థర్టీస్ లోనే వున్నానంటున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఇటీవలే అరవయ్యేళ్ళు పూర్తి చేసుకున్న రజనీకాంత్, ఈ సందర్భంగా తన సన్నిహితులకు గ్రాండ్ గా పార్టీ కూడా ఇచ్చాడు చెన్నయ్ లో. తమిళ సినీ ప్రముఖులు ఈ ఫంక్షన్ లో పాల్గొని రజనీకాంత్ కి శుభాకాంక్షలు అందజేశారు. అయితే, తన శరీరానికి మాత్రమే అరవయ్యేళ్లు నిండాయనీ, మానసికంగా తానింకా ముప్పేయ్యేళ్ళ కుర్రాడినేనని తన అరవయ్యవ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న సినీ ప్రముఖలతో రజనీకాంత్ అన్నాడట.
ఇదే విషయమై రజనీకాంత్ ని ఇటీవల ఓ విలేకరి ప్రశ్నిస్తే, నేను నిజమే చెప్పాను..'రోబో" సినిమాలో నన్ను చూశారుగా ఎలా వున్నానో..అదే ఉత్సాహం ఇంకా నాలో వుంది..ఉత్సాహంతో వుంటేనే ముందుకు సాగగలం..స్టార్ డమ్ ని ఎంజాయ్ చేస్తాను..అదే సమయంలో మనిషిగా బాధ్యతనూ గుర్తుంచుకుంటాను. వయసు విషయంలోనూ అంతే హుందాగా వుండాల్సిన చోట అరవయ్యేళ్ళు..సరదాగా గడపాల్సిన చోట ముప్పయ్యేళ్ళు..ఇదే నా జీవిత రహస్యం.." అంటూ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. సినిమాలో రజనీ చెప్పే డైలాగులకన్నా పవర్ ఫుల్ గా వుంది కదూ రజనీ రియల్ లైఫ్ లో చెప్పిన డైలాగ్...


Click it and Unblock the Notifications











