»   » కళామతల్లి కమల్ హాసన్ పై పక్షపాతం !

కళామతల్లి కమల్ హాసన్ పై పక్షపాతం !

Posted By:
Subscribe to Filmibeat Telugu

పద్మశ్రీ కమల్ హాసన్ ఇటీవల తన 50 సంవత్సరాల నట జీవితాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా ఆయన అభిమానులు ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రజనీ మాట్లాడుతూ తామందరం కళామతల్లికి ముద్దు బిడ్డలమే అయినప్పటికీ కమల్ అంటే కళామతల్లికి ప్రత్యేకమైన ప్రేమ అనీ, అందుకే నటనను తామందరి కంటే కమల్ కి కాస్త ఎక్కవగా ఇచ్చిందని అన్నారు.

అంతటితో రజనీ ఊరుకోకుండా ఆయన చేసిన ప్రసంగ సారాంశాన్ని ప్రతిఫలిస్తూ ఓ చిత్ర పటాన్నితయారు చేయించి కమల్ కి కానుకగా ఇచ్చారు. ఈ చిత్ర పటంలో కళామతల్లి కమల్ ని చంకనెత్తుకోగా...అమితాబ్, మోహన్ లాల్, మమ్ముట్టి, చిరంజీవి వంటి స్టార్స్ అందరూ ఆమె వెంట అడుగులేస్తుండడం మనం చూడవచ్చు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu