రజని కుమార్తె పెళ్ళిలో అతిథులకు ఇచ్చే గిఫ్ట్ ఇదా.. చాలా చీప్, గొప్ప పని చేస్తున్న సూపర్ స్టార్!

Recommended Video

Soundarya Rajinikanth's Wedding Ceremony | Flmibeat Telugu

సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య రజనీకాంత్ వివాహ వేడుక అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. శుక్రవారం చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు. చాలా మంది ప్రముఖులు ఈ రిసెప్షన్ కు హాజరైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే వెడ్డింగ్ రిసెప్షన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. రజనీకాంత్ స్వయంగా సినీ, రాజకీయ ప్రముఖుల్ని కలసి వివాహ వేడుకకు ఆహ్వానించారు. ఈ వివాహ వేడుకలో అతిథులకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఆకట్టుకుంటోంది.

అతిథులకు ఇచ్చే గిఫ్ట్ ఇదా

అతిథులకు ఇచ్చే గిఫ్ట్ ఇదా

సౌందర్య రజనీకాంత్ రెండో వివాహానికి బడా పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు, సినీ సెలేబ్రిటిలు హాజరవుతున్నారు. ఈ వివాహ వేడుకలో రజని కుటుంబం హాజరైన అతిథులకు ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. సూపర్ స్టార్ కుమార్తె వివాహం అంటే చాలా కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తారని అంతా అనుకోవచ్చు. కానీ అలాంటిదేమి జరగడం లేదు. చాలా తక్కువ ఖర్చు కలిగిన గిఫ్ట్ నే ఇస్తున్నారు. వేప చెట్టు సీడ్ బాల్స్ ని అతిథులకు గిఫ్ట్ గా ఇస్తున్నారు.

 గొప్ప పని

గొప్ప పని

ప్రస్తుతం కంప్యూటర్ యుగంలో చెట్లు, అడవులు ఎలా అంతరించిపోతున్నాయో అందరికి తెలిసిందే. మానవ మనుగడ సాఫీగా జరగాలంటే అధిక శాతం చెట్లు ఉండాలి. సులభ పద్దతిలో చెట్లు పెంచే విధానమే సీడ్ బాల్స్. వివిధ చెట్ల విత్తనాల్ని మట్టి, ఆవుపేడ కలిపిన ముద్దలో నిల్వ చేస్తారు. వాటిని భూమిమీద వేసేస్తే చాలు. కొన్ని రోజులకు చెట్లుగా మారుతాయి. పని కట్టుకుని మొక్కల్ని నాటాల్సిన అవసరం లేదు. రజని కుమార్తె వివాహంలో వేప గింజల సీడ్ బాల్స్ ని అతిథులకు గిఫ్ట్ గా ఇస్తున్నారట.

రెండో వివాహం

రెండో వివాహం

ఇక సౌందర్య రజనీకాంత్ వివాహం విషయానికి వస్తే ఆమెకు ఇది రెండవ వివాహం. మొదటి భర్త అశ్విన్ తో విడిపోయింది. ప్రస్తుతం ఆమెకుకాబోయే భర్త నటుడు, పారిశ్రామిక వేత్త అయిన విషగన్. అతడికి కూడా ఇది రెండవ వివాహమే. శుక్రవారం గ్రాండ్ గా రిసెప్షన్ జరిగింది. 11వ తేదీన కుటుంబ సభ్యులు, అతిథుల మధ్య వైభవంగా వివాహం జరగబోతోంది.

దర్శకురాలిగా

దర్శకురాలిగా

సౌందర్య రజనీకాంత్ కు మంచి గ్రాఫిక్ డిజైనర్ గా గుర్తింపు ఉంది. దర్శకురాలిగా కూడా ఆమె రజనీతోనే విక్రమసింహ అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందిన ఈ చిత్రం నిరాశపరిచింది. రజనీకాంత్ ఇప్పటికే సౌందర్య వివాహానికి కమల్ హాసన్, ప్రభు వంటి సినీ తరాలని ఆహ్వానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X