త్వరలోనే ఫ్యాన్స్ ముందుకు వస్తా: రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ థానే తుఫాను బాధితుల కోసం రూ. 10లక్షల విరాళం అందజేశారు. ఈ మేరకు శుక్రవారం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలిసి చెక్కును అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే కొచ్చాడయన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తానని తెలిపారు. మరోసారి రజనీకాంత్ తన దాతృత్వాన్ని చాటు కోవడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కొచ్చాడయాన్ సినిమాకు రజనీ కూతురు సౌందర్య దర్శకత్వం వహిస్తున్నారు. కె.ఎస్. రవికుమార్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. సౌందర్యకు తొలిసారి దర్శకరత్వ కావడంతో ఆయనే దగ్గరుండి సినిమాను పర్యవేక్షిస్తున్నారు. ఈ చిత్రంలో రవిరాజా పనిశెట్టి తనయుడు ఆది ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. హీరోయిన్ స్నేహ రజనీ చెల్లెలి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. శోభన అతిథి పాత్రలో కనిపిస్తోంది. అయితే హీరోయిన్ ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు.
ఈ చిత్రంలో రజనీకాంత్.. రణధీరన్ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. పల్లవుల కాలం నాటి కథతో ఈచిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్ మీనన్ కెమెరా వర్క్ అందించనున్నారు. ఫెర్ఫార్మెన్స్ క్యాప్చరింగ్ పరిజ్ఞానంతో ఈ సినిమాను త్రీడీలో చిత్రిస్తారు. 2012 ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











