రజనీ సెంటిమెంట్ ప్లేస్ లో ఏప్రిల్ 20న రాణా ప్రారంభం...
సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న 'రాణా" సినిమా ఈ నెల 20న చెన్నైలో ప్రారంభం కోబోతోంది. సౌత్ సూపర్ స్టార్ రజని కాంత్ 'రోబో' తరవాత నటించబోతున్న చిత్రం 'రాణా'. గత కొంతకాలంగా వార్తల్లో ప్రధానంగా వినిపిస్తున్న ఈ చిత్రంలో దీపిక పదకొనే రజనితో జోడీ కడుతుంది. తమిళ, తెలుగు, హిందీ బాషలలో తెరకెక్కనున్న ఈ చిత్ర ప్రారంబోత్సవ వేడుకు ఏప్రిల్ 20న చెన్నైలోని రజనీకాంత్ సెంట్ మెంట్ గా ఫీలయ్యే ఏవియం. స్టూడియోలో జరగనుందని కోలీవుడ్ సమాచారం.
రజని త్రిపాత్రభినయం చేస్తున్న ఈ చిత్రాన్ని దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో ఎరోస్ఇంటర్ నేషనల్ సంస్థ తో కలిసి ఆయన చిన్న కుమార్తె సౌందర్య నిర్మిస్తుంది. చారిత్రాత్మక కధాంశంతో రూపుదిద్దుకుంటున్న రాణా చిత్రానికి కెయస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి యూరప్ లో ఓ పాట చిత్రీకరణతో సినిమా షూటింగుకు దర్శకుడు కెయస్ రవికుమార్ శ్రీకారం చుడతారు. కథ ప్రకారం ఎక్కువ భాగం టాకీని యూరప్ లోనే చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. స్వరమాంత్రికుడు రెహమాన్ సంగీతాన్నిసమకూరుస్తున్నాడు. రత్నవేల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు.
ఇంకా ఇద్దరు కధనాయకిల ఎంపిక జరగవలసి ఉంది. ఇలియానా, విద్యాబాలన్, రేఖ తదితరుల పేర్లు వినిపించాయి కానీ ఎవరూ ఫైనల్ కాలేదు. ఈ చిత్రాన్ని 2012లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా దర్శకనిర్మాతలు ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











