లాభాలు రాలేదు, అందుకే రజనీకాంత్ ఆ నిర్ణయం తీసుకున్నారా?

సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలకు కమిట్ అవుతూ హిట్స్ మీద హిట్స్ కొడుతున్నారు. ఆయన తాజా చిత్రం 'పేట' సంక్రాంతికి విడుదలై విజయవంతంగా 25 రోజులు పూర్తి చేసుకోవడంతో పాటు రూ. 200 కోట్లకుపైగా వసూలు చేసి బాక్సాఫీసు వద్ద ఇంకా స్ట్రాంగ్‌గా రన్ అవుతోంది.

ప్రస్తుతం రజనీకాంత్ తన చిన్న కూతురు సౌందర్య రెండో వివాహానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. ఫిబ్రవరి 11న ఆమె వివాహం జరుగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ హడావుడి పూర్తయిన తర్వాత ఆయన నెక్ట్స్ మూవీ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ప్రారంభం కాబోతోంది.

రజీనీకాంత్ రెమ్యూనరేషన్ తగ్గించుకుంటున్నారా?

రజీనీకాంత్ రెమ్యూనరేషన్ తగ్గించుకుంటున్నారా?

రజనీ-మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు. దీనికి రజనీ తన రెమ్యూనరేషన్ భారీగా తగ్గించుకుంటున్నట్లు సమాచారం. 2.0 సినిమా వల్ల లైకా ప్రొడక్షన్స్‌కు లాభాలు రాక పోవడమే ఇందుకు కారణమట.

లాభాలు తెచ్చి పెట్టని 2.0

లాభాలు తెచ్చి పెట్టని 2.0

శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందించిన 2.0 చిత్రం బాక్సాఫీసు వద్ద పలు రికార్డులు బద్దలు కొట్టింది. అయితే నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టడంలో విఫలైంది. ఈ మూవీ కోసం లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఓవర్‌గా రూ. 543 కోట్లు ఖర్చు చేశారు. కారణాలేమైనా చివరకు నష్టం తప్పలేదు.

అపుడు రూ. 60 కోట్లు తీసుకున్న రజనీ?

అపుడు రూ. 60 కోట్లు తీసుకున్న రజనీ?

2.0 చిత్రానికి రజనీకాంత్ రూ. 60 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అయితే మురుగదాస్ దర్శకత్వంలో చేసే సినిమాకు అంత తీసుకోవడం లేదని తెలుస్తోంది. మార్చిలో ఈ మూవీ ప్రారంభం కానుంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

పొలిటికల్ మూవీ కాదు

పొలిటికల్ మూవీ కాదు

గతంలో ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు ఏఆర్ మురుగదాస్ మాట్లాడుతూ.. ఇది పొలిటికల్ మూవీ కాదని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను, అభిమానులను సంతృప్తి పరిచే కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం ఉంటుందన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X