»   » రిజెక్ట్: నన్ను కొడితే ఫ్యాన్స్ తట్టుకోలేరన్న రజనీకాంత్

రిజెక్ట్: నన్ను కొడితే ఫ్యాన్స్ తట్టుకోలేరన్న రజనీకాంత్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మళయాలంలో సూపర్ హిట్టయిన దృశ్యం చిత్రాన్ని ఆ తర్వాత తెలుగులో, హిందీలో రూపొందించిన సంగతి తెలిసిందే. తెలుగులో వెంకీ చేయగా, హిందీలో అజయ్ దేవగన్ చేసారు. తాజాగా తమిళంలో కమల్ హాసన్ హీరోగా ఈచిత్రాన్ని ‘పాపనాశనం' పేరుతో రీమేక్ చేసారు.

Rajinikanth

వాస్తవానికి ఈ చిత్రాన్ని తమిళంలో రజనీకాంత్‌తో చేయాలనుకున్నారట. అయితే సినిమాలో పోలీసులు హీరోను తీవ్రంగా కొట్టే సన్నివేశాలు ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కుటుంబాన్ని కూడా తీవ్రంగా హింసిస్తారు. ఈ రెండు అంశాల కారణంగానే రజనీకాంత్ ఈ చిత్రాన్ని తిరస్కరించారట. తనను బాగా కొట్టడం చూసి అభిమానులు తట్టుకోలేరని, అందువల్ల ఫలితాలు సరిగా రాక పోవచ్చని రజనీకాంత్ చెప్పారట. ఈ విషయాన్ని దర్శకుడు జీతూ జోసెఫ్ స్వయంగా వెల్లడించారు.

కాగా... తమిళంలో కమల్ హాసన్, గౌతమి నటించిన ‘పాపనాశనం' చిత్రం ఇటీవల విడుదలై మంచి ఓపెన్సింగ్ సాధించింది. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

English summary
Superstar Rajinikanth rejected an offer to star in the Tamil remake of Malayalam blockbuster “Drishyam” because he feared two particular scenes in the film would not have gone down too well with his fans.
Please Wait while comments are loading...