twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీ అనారోగ్యంపై వైరల్‌గా లేఖ.. సూపర్‌స్టార్ క్లారిటీ.. పాలిటిక్స్ గుడ్‌బై అంటూ నేతల సెటైర్లు

    |

    సూపర్‌స్టార్ రజనీకాంత్ అనారోగ్యం విషయం మరోసారి తమిళ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఆరోగ్య కారణాల వల్ల రజనీకాంత్ రాజకీయాలకు దూరం కావాలని వైద్యులు సూచించినట్టు ఓ లేఖ మీడియాలోను, సోషల్ మీడియాలో వైరల్ కావడం మరింత సంచలనంగా మారింది. ఈ క్రమంలో రజనీకాంత్ స్పందిస్తూ.. తన ఆరోగ్యం, రాజకీయాలపై వివరణ ఇస్తూ...

    రజనీకాంత్ ఆరోగ్యంపై మీడియాలో లేఖ

    రజనీకాంత్ ఆరోగ్యంపై మీడియాలో లేఖ

    సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖకు తనకు సంబంధం లేదు. కానీ ఆ లేఖలో నా ఆరోగ్యం గురించి ప్రస్తావించిన విషయాలు నిజమే అని రజనీకాంత్ క్లారిటీ ఇచ్చారు. రజనీకాంత్ వివరణతో ఆయన ప్రత్యర్థులు అనేక రకాల ఉద్దేశాలను ప్రతిపాదించడం ఇప్పుడు వివాదంగా మారుతున్నది.

    కరోనావైరస్ కారణంగా పొలిటికల్ ఎంట్రీ ఆలస్యం

    కరోనావైరస్ కారణంగా పొలిటికల్ ఎంట్రీ ఆలస్యం


    రజనీకాంత్ ఆరోగ్యంపై సోషల్ మీడయాలో వైరల్ అవుతున్న లేఖ ప్రకారం.. కరోనావైరస్ కారణంగా ఆరోగ్యం దెబ్బ తినే అవకాశం ఉండటంతో రజనీకాంత్ రాజకీయ ప్రవేశానికి మరో విఘాతం జరిగింది. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటెడ్ పేషెంట్ అయిన రజనీకాంత్ బయట విస్తృతంగా తిరిగితే ఆయన ఆరోగ్యానికి ముప్పు కలిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పట్లో ఆయన ప్రజల్లోకి వెళ్లే అవకాశం లేదు అంటూ లేఖలో పలు విషయాన్ని ప్రస్తావించారు.

    కోవిడ్‌కు వ్యాక్సిన్ వచ్చినా ఆయనకు ముప్పే..

    కోవిడ్‌కు వ్యాక్సిన్ వచ్చినా ఆయనకు ముప్పే..


    ఇక అంతేకాకుండా ఒకవేళ కోవిడ్ 19 వ్యాధికి వ్యాక్సిన్ వచ్చినా రజనీకాంత్‌కు ఆ ముప్పు తప్పించలేం. ప్రస్తుతం ఆయన ఇమ్యూనిటీ స్థాయి బలహీనంగా ఉండటం వల్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరించారు. ఈ క్రమంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి ప్రవేశించడం మరింత ఆలస్యం అవుతుందనే విషయంపై తమిళనాడులో రచ్చ జరుగుతున్నది.

    అభిమానులను కుంగ దీస్తున్న లేఖ

    అభిమానులను కుంగ దీస్తున్న లేఖ


    ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే రజనీకాంత్ కరోనావైరస్ బారిన పడే అవకాశం ఉందనే విషయం అభిమానులను కుంగ దీస్తున్నది అంటూ లేఖలో పేర్కొన్న విషయంపై రజనీకాంత్ ఘాటుగా స్పందించారు. నా గురించి బెంగ పడాల్సిన అవసరం లేదు. నా చుట్టు ఉన్న వాళ్ల గురించి, వారికి ఏదైనా జరుగుతుందనే నాకు భయం ఉంది అని రజనీకాంత్ తెలిపారు.

    Recommended Video

    Rajinikanth,Pawan Kalyan,K viswanath Expresses Their Condolences For SPB
    రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై తమిళ నేతల సెటైర్లు

    రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై తమిళ నేతల సెటైర్లు


    తాజాగా లేఖ వివాదంపై తమిళనాడులోని పలు రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు ఘాటుగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి ప్రవేశించకుండానే అస్త్ర సన్యాసం చేస్తున్నారు. ఆయన ఎంట్రీ ఇవ్వకుండానే గుడ్‌బై చెబుతున్నారు అంటూ వీసీకే నేత ఆర్ రవికుమార్ వ్యాఖ్యానించారు. ఇంకా పలు రాజకీయ పార్టీల నేతలు పలు రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేయడం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

    English summary
    Rajinikanth reaction on leaked leatter on his health which is viral on social media. He said, Letter is not mine, But Health details in letter is true. In this letter issue, Political opponents criticising his political plans.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X