CAA: పౌరసత్వ సవరణ చట్టంపై రజినీకాంత్ రియాక్షన్

పౌరసత్వ సవరణ బిల్లు (CAB) పార్లమెంట్‌లో ఆమోదం పొంది పౌరసత్వ సవరణ చట్టం (CAA) గా మారింది. అయితే ఈ చట్టానికి వ్యతిరేకంగా పలువురు నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ చట్టం లౌకికవాదానికి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆదోళనలు, నిరసనలు ఉదృతం అయ్యాయి.

దేశంలోని కొన్ని ప్రజా సంఘాలు,పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఇప్పటికే ఈ చట్టంపై తమ తమ స్పందన తెలియజేశారు. ఈ మేరకు సూపర్ స్టార్ రజనీకాంత్‌ను దీనిపై స్పందించాల్సిందిగా కోరగా ఆయన నిరాకరించడం జరిగింది. కాగా ప్రస్తుత పరిస్థితులు, నిరసనలు, హింసాత్మక ఘటనలు చూసిన రజినీకాంత్ ఎట్టకేలకు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

హింస అనేది సమస్యలకు పరిష్కారం కాదని రజినీ తెలిపారు. భారత పౌరులంతా ఐక్యంగా ఉండాల్సి ఉందని పేర్కొంటూ, దేశ భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచకుని అప్రమత్తంగా వ్యవహరించాలని ట్వీట్ పెట్టారు రజినీకాంత్. జరుగుతున్న హింసాత్మక పరిణామాలకు తానూ తీవ్రంగా కలత చెందుతున్నానని ఆయన తెలిపారు. రజనీకాంత్ చేసిన ఈ ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు #IStandWithRajinikanth #ShameOnYouSanghiRajini అనే హాష్‌టాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

Rajinikanth Response On CAA

పౌరసత్వ సవరణ చట్టం (CAA)పై ఇప్పటికే రాజ్ కుమార్ రావు, ఆయుష్మాన్ ఖురానా, రిచా చద్దా, హుమా క్యురేషీ, పరిణితి చోప్రా, అదేవిధంగా ఫీల్ మేకర్స్ అనురాగ్ కశ్యప్, అనుభవ్ సిన్హా, రైటర్ చేతన్ భగత్ లాంటి వారు కూడా స్పందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X