4000 తీసుకొని రజనీకి నున్నగా గుండు కొట్టేశారట.. లేటేస్ట్ ఫ్యాషన్ అని.. తలైవా చెప్పిన ఫన్నీ స్టోరీ!

సూపర్ స్టార్ రజనీకాంత్ గొప్ప నటుడే కాకుండా మంచి వక్త. ఏదైనా విషయాన్ని ఆసక్తికరంగా, వినోదాత్మకంగా చెప్పడంలో ఆయనకు సాటి ఎవరు రారనే చెప్పాలి. పబ్లిక్‌లో ఆయన మాట్లాడుతుంటే.. స్పూర్తిదాయకంగానే కాకుండా విజిల్స్, చప్పట్లు మార్మోగాల్సిందే. ఆయన చెప్పే మాటలు ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ గొప్ప ఇన్‌ఫ్లూయెన్సర్‌గా గుర్తు చేస్తాయి. అలాగే తన మాటలతో ప్రేరణ కలిగించే టాప్ మోటివేటర్‌గా తలైవా కనిపిస్తారు. అయితే ఆయన ఎప్పుడూ మాట్లాడినా సోషల్ మీడియాలో ట్రెండ్ కావాల్సిందే. ఆయన సరదాగా తనకు జరిగిన అనుభవాన్ని వివరించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఆ వీడియోలో రజనీ చేసిన ఫన్నీ స్పీచ్ ఎలా ఉందంటే?

రజనీకాంత్‌ స్పీచ్ ఇచ్చారంటే ఈల పెట్టి గోల చేయాల్సిందే. ఆయన ఎదుటి వ్యక్తిపై వారికే తెలియకుండా సెటైర్ వేస్తారు. కొన్నిసార్లు చాలా పరుషంగా తాను చేసే కామెంట్స్ ఎదుటి వారికి గట్టిగా చురకలు పెట్టినట్టు ఉంటాయి. ఓ సందర్భంలో అంటే.. స్వర్గీయ ఎన్టీఆర్‌కు సంబంధించిన వేడుకలో తాను చంద్రబాబుపై ప్రశంసలు గుప్పిస్తే.. వైసీపీ నేతలందరూ ఆయనపై విరుచుకుపడ్డారు. ఆ విషయంపై ఓ ఆడియో ఫంక్షన్‌లో మొరగని కుక్క ఊరు ఉండదు.. కాబట్టి మన పని మనం చేసుకోవాలి.. అర్ధమైందా? రాజా అంటూ వేసిన సైటర్ వైసీపీ శ్రేణులకు గట్టిగానే తగిలిన విషయం తెలిసిందే.

Rajinikanth s New York Experience

ఇక ఇటీవల కాలంలో ఓ పుస్తక విజయోత్సవ సభలో మాట్లాడుతూ.. నన్ను ఈ సభకు ఎందుకు పిలిచారో అర్ధం కావడం లేదు. కన్నడ శివరాజ్ కుమార్, కమల్ హాసన్ లాంటి మేధావులు ఉండగా.. నన్ను ఎందుకు పిలిచారో తెలియలేదు. నేను 75 ఏళ్ల ముసలివాడిని. కళ్లద్దాలు పెట్టుకొని స్లో మోషన్‌లో నడిచి రావడం తప్పా నాకు ఏమీ తెలియదు అంటూ దర్శకుడు ఆర్జీవికి చురకలు అంటించారు. ఇలా తన ప్రసంగాలను సైటర్లతో కొనసాగిస్తాడు.

తాజాగా రజనీకాంత్‌కు సంబంధించిన వీడియో ఒకటి ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నది. ఆయన చేసిన స్పీచ్ 1996 సంవత్సరంలో సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డుల సందర్భంగా చేసిందనే విషయం ఈ వీడియో ద్వారా స్పష్టమైంది. అయితే తనకు అమెరికాలో జరిగిన వింత అనుభవం గురించి రజనీకాంత్ చాలా ఫన్నీగా, వినోదంగా చెప్పడం అందర్నీ నవ్వుల్లో ముంచెత్తింది.

రజనీకాంత్ మాట్లాడుతూ.. నేను ఇలా గుండులో కనిపించడం వెనుక కథ ఉంది. నేను అనుకోకుండా గుండు కొట్టించుకోవాల్సి వచ్చింది. అమెరికాలో న్యూయార్క్‌లో ఉన్న సమయంలో పేపర్లలో లేటేస్ట్ హెయిర్ స్టయిల్ కావాలా? అనే యాడ్ కనిపించింది. దాంతో నా హెయిర్ స్టయిల్ మార్చుకొంటే బాగుంటుందనిపించింది. న్యూయార్క్ లేటెస్ట్ హెయిర్ స్టయిల్ ఏముందో అని ఉత్సాహంగా ఫోన్ చేశాను. అందులో నా పేరు.. ఇంటి పేరు.. అన్ని వివరాలు రాసుకొని నాకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. దాంతో ఆ సెలూన్ అడ్రస్ కనుక్కొని వెళ్లాను అని రజనీకాంత్ చెప్పారు.

ఆ సెలూన్‌కు వెళ్లగానే నన్ను ఆహ్వానించి.. మీకు న్యూయార్క్ ఫ్యాషన్ హెయిర్ స్టయిల్ కావాలా? అయితే అంతకు ముందు హెడ్ మసాజ్ చేస్తాం. మీరు రిలాక్స్‌డ్‌గా ఉండండి అని చెప్పారు. దాంతో సీట్లో కూర్చోగానే మసాజ్ చేయడం ప్రారంభించారు. జెట్ లాగ్ కారణంగా నాకు నిద్ర పట్టేసింది. మధ్యలో రేజర్ సౌండ్ వస్తే.. ఫ్లయిట్ సౌండ్ అనుకొని కళ్లు అలానే మూసుకొన్నాను. తీరా పని ముగించిన తర్వాత చూస్తే.. నా తల మీద ఒక్క వెంట్రుక లేకుండా గుండుగా కనిపించింది. ఎలా ఉందని వారు అడిగితే.. ఇండియాలో ఇలాంటి కట్, స్టయిల్ ఎవరూ చేయరని సమాధానం చెప్పాను. బిల్ ఎంత అని అడిగితే.. అప్పట్లో 120 డాలర్లు అని చెప్పారు. అంటే అప్పట్లో సుమారుగా ఇండియా కరెన్సీలో 4 వేల రూపాయలు. చేసేది ఏమీ లేక ఫెంటాస్టిక్ అంటూ బయటకు వచ్చాను అని ఆయన రజనీ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

More from Filmibeat

Read more about: rajinikanth kollywood coolie
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X