Ponniyin Selvan మణిరత్నంను చీట్ చేసిన కమల్, రజనీకాంత్.. సీక్రెట్ బయటపెట్టిన సూపర్ స్టార్
ఇండియన్ సినిమా పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకొంటున్న చిత్రం పొన్నియన్ సెల్వన్. సంచలన దర్శకుడు మణిరత్నం డైరెక్షన్‌లో, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ సంగీత దర్వకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిషతోపాటు భారీ తారాగణం నటించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్, ఆడియో లాంచ్ వేడుక చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకు సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.

మణిరత్నం పర్‌ఫెక్షన్ గురించి
స్పీచ్‌కు ప్రేక్షకులు, అభిమానుల నుంచి భారీ ఆదరణ వచ్చింది. గతంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన దళపతి సినిమా సందర్భంగా జరిగిన సంఘటనలు చెబుతుంటే.. అగ్రతారలే కాకుండా అభిమానులు, వేడుకకు వచ్చిన ప్రేక్షకుల కూడా పడిపడి నవ్వారు. దళపతి సినిమా సమయంలో మణిరత్నం చూపించిన పర్‌ఫెక్షన్ గురించి చెబుతూ.. రజనీకాంత్ నవ్వులు పూయించారు.

సీన్లను రిజెక్ట్ చేసేవాడు
రజనీకాంత్ మాట్లాడుతూ.. నా కెరీర్‌లో రకరకాల ఎక్స్‌ప్రెషన్స్‌తో సీన్లను పండించాను. వాటి వల్ల సినిమాలు బాగా ఆడాయి. నా మేనరిజమ్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. దళపతి సినిమా షూటింగులో భయం, ప్రేమ, షాక్, ఇతర ఎమోషన్స్ పలికించాల్సి వచ్చింది. నేను ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ పెట్టినా మణిరత్నం సంతృప్తి చెందలేదు. నేను ఎలా చేసినా రిజెక్ట్ చేసేవాడు. సీన్లను ఒకే చేయకుండా టార్చర్ పెట్టేవాడు అని రజనీకాంత్ తెలిపారు.

ఫీల్ కావాలంటూ టార్చర్
నేను ఏదైనా సీన్లో నటించేటప్పుడు ఫీల్ కావాలని చెప్పేవాడు. ఆయన కావాల్సిన ఫీల్ ఏమిటో నాకు అర్ధం అయ్యేది కాదు. కొన్ని డైలాగ్స్ చెబితే.. ఫీల్ లేదని విసుక్కొనేవాడు. మణిరత్నం మేకింగ్ స్టైల్ చూసి నేను చాలా ఇబ్బంది పడ్డాను. నేను ఎన్నో సినిమాల్లో నటించాను. నేను ఎప్పడూ ఎలాంటి ఇబ్బందికి గురికాలేదు అని రజనీకాంత్ చెప్పారు.

కమల్ సలహాతో గట్టెక్కాను
మణిరత్నంతో అంతకు ముందే నాయకుడు సినిమాలో కమల్ హాసన్ నటించాడు. దాంతో మణిరత్నం పెట్టే బాధ గురించి కమల్‌తో పంచుకొన్నాను అని పొన్నియన్ సెల్వన్ వేదికపైన కమల్ పక్కనే నించుని ఈ విషయాలు చెప్పారు. అయితే తాను కూడా ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొన్నానని తన గోడు కమల్ చెప్పాడు అని రజనీకాంత్ తెలిపారు. అయితే మణిరత్నంను ఆ సీన్‌లో నటించి చూపించమను. ఆ తర్వాత నీ స్టైయిల్ జోడించు నటించమని తనకు కమల్ ఓ సలహా ఇచ్చాడు. దాంతో నేను అలానే పాటించి చేశాను అని రజనీకాంత్ తెలిపారు.

మణిరత్నంను చీటింగ్ చేశాం
దళపతి సెట్లో రజనీకాంత్‌కు ఇబ్బంది ఎదురైప్పుడు మణిరత్నంను ఎలా చేయాలో చూపించమని అడిగాను. మణిరత్నం నటించి చూపిస్తే.. నేను అలానే చేశాను. అలా ఆయన సంతృప్తి చెంది.. సీన్ ఓకే చేసేవారు. అలా మణిరత్నంను నేను, కమల్ చీట్ చేసేవాళ్లం అని రజనీ చెప్పగానే అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. మణిరత్నం బాధ నుంచి గట్టెక్కించిన కమల్‌కు ఈ సందర్భంగా రజనీ థ్యాంక్స్ చెప్పాడు.


Click it and Unblock the Notifications











