తమన్నా విషయంలో జానీ మాస్టర్ అలా చీటింగ్.. తన బాధను బయటపెట్టిన రజనీకాంత్
అట్టహాసంగా చెన్నైలో జరిగిన జైలర్ ఆడియో రిలీజ్ వేడుకలో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ప్రసంగం సోషల్ మీడియా, యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా నిలిచింది. ఈ ఫంక్షన్‌లో ఆయన చెప్పిన విషయాలు, చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దాదాపు గంటసేపు సాగిన రజనీ స్పీచ్‌లో ఆయన అనేక విషయాలు ప్రస్తావించారు. ఈ వేడుకలో తమన్నా స్టెప్పులేసిన కావాలా సాంగ్‌లో జానీ మాస్టర్ చేసిన టీజింగ్, చీటింగ్‌ను వేదికపై రజనీకాంత్ బయటపెడుతూ..
తమన్నా భాటియాతో కావాలా సాంగ్ చిత్రీకరించాల్సి ఉందని చిత్ర యూనిట్ చెప్పారు. అయితే తమన్నా డేట్స్ లేకపోవడంతో ఆ పాట షూట్ ఆలస్యమైంది. ఈ సమయంలో నేను లాల్ సలామ్ సినిమా షూట్‌కు వెళ్లాలని అనుకొంటున్న సమయంలో తమన్నా 5 రోజులు డేట్స్ ఇచ్చింది. పాట షూట్ చేద్దామని చెప్పారు. దాంతో లాల్ సలామ్ షూటింగ్ క్యాన్సిల్ చేసుకొన్నాను అని రజనీకాంత్ చెప్పారు.

అయితే కావాలా సాంగ్‌ను జానీ మాస్టర్ కొరియోగ్రఫి చేస్తున్నారు. ఆ సాంగ్‌లో మీరు కూడా ఉంటారని చెప్పారు. దాంతో నేను ఆ సాంగ్ కోసం ప్రిపేర్ అయి ఉన్నాను. పాట షూట్ మొదలైంది. రెండు, మూడు రోజులు గడిచాయి. నన్ను పిలువలేదు. దాంతో నా సహనం నశించి.. చిత్ర యూనిట్‌కు ఫోన్ చేసి.. నన్ను పిలవడం లేదు అంటే.. పాట షూట్ అవుతుంది. మిమ్మల్ని పిలుస్తామని చెప్పారని రజనీకాంత్ తెలిపారు.
ఇక ఐదో రోజు నాకు కాల్ వచ్చింది. పాట షూట్‌లో మీరు ఉంటారు. మధ్యాహ్నం తర్వాత షూట్ ఉంటుందన్నారు. 2.30 గంటలైంది. 5 గంటలైంది. కానీ కాల్ రాలేదు. చివరకు 7.30 గంటలకు కాల్ వచ్చింది. దాంతో నేను మేకప్ చేసుకొని సెట్స్‌కు వెళ్లాను. ఏంటి సాంగ్‌లో నేను లేనా అంటే.. సినిమా అంతా మీరు ఉన్నారు కదా.. ఈ పాటలో తమన్నాను ఫుల్లుగా చూపిద్దామని అనుకొంటున్నాం అని జానీ మాస్టర్ చెప్పారు.

చివరకు జానీ మాస్టర్ పిలిచి.. ఒక స్టెప్పు వేయించాడు. కానీ నా పక్కన తమన్నా లేదు. కనీసం తమన్నాతో మాట్లాడించలేదు. తమన్నాతో కలిసి స్టెప్పులు లేవు. ఒకే ఒక స్టెప్పు వేసి.. సాంగ్ అయిపోయిందని చెప్పారు. దాంతో నాకు ఏం చేయాలో అర్ధం కాలేదు. జానీ మాస్టర్ ఏం చేశాడో నాకు అర్ధం కాలేదు అని రజనీకాంత్ చెప్పారు.

ఏది ఏమైనా కావాలా సాంగ్ చాలా బాగా వచ్చింది. తమన్నా బ్రహ్మండంగా చేసింది. ఆ పాట ఎంత కిక్ ఇచ్చిందంటే.. ప్రోమో రిలీజ్ చేయడానికి ప్రోమో చేయాల్సి వచ్చింది. తమన్నా అద్బుతంగా వచ్చింది. తమన్నాను చూస్తే అలా ఉంటుంది కానీ.. ఆమెలో చాలా ఆధ్యాత్మికత ఉంది. చాలా మంచి మనిషి అంటూ తమన్నాపై రజనీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. రజనీకాంత్ ప్రసంగం ఆద్యంతం నవ్వులతో సాగింది.


Click it and Unblock the Notifications











