Rajinikanth review on Kantara.. రోమాలు నిక్కబొడిచాయి.. రిషబ్ శెట్టి హ్యాట్సాఫ్.. రజనీకాంత్ ప్రశంసల వర్షం
కంతార సినిమాకు ప్రపంచవ్యాప్తంగా భారతీయుల నుంచి భారీ స్పందన వస్తున్నది. సాధారణ ప్రేక్షకులే కాకుండా సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. అన్ని వర్గాల నుంచి ఈ సినిమాకు భారీ రెస్సాన్ మాత్రమే కాకుండా రికార్డు కలెక్షన్లు నమోదు అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కంతార సినిమా గురించి ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ సోషల్ మీడియాలో ఇచ్చిన రివ్యూ ఎలా ఉందంటే?

సెప్టెంబర్ 30న కన్నడ చిత్రంగా
కంతార చిత్రం కన్నడ భాషకు మాత్రమే పరిమితమై సెప్టెంబర్ 30 తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేశవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ అయిన ఈ సినిమాను భాష, ప్రాంతమనే బేధం లేకుండా ఆదరించారు. కన్నడ భాషలో రిలీజైన ఈ సినిమా రికార్డు కలెక్షన్లు నమోదు చేసింది. దాంతో ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళంలోకి డబ్ చేసి రిలీజ్ చేశారు.

దేశవ్యాప్తంగా ప్రభంజనం
కంతారా చిత్రం గత రెండు వారాలుగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్నది. హిందీలో తాజాగా రిలీజైన రామ్ సేతు, థ్యాంక్ గాడ్, బ్లాక్ ఆడమ్ సినిమాల పోటీని తట్టుకొని భారీ వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం హిందీలో ఇప్పటి వరకు 26.5 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక తెలుగులో 11 రోజుల్లో 15.91 కోట్ల షేర్, 28.25 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

రజినీకాంత్ ఎమోషనల్ ట్వీట్
కంతార సినిమా చూసిన తర్వాత రజినీకాంత్ ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు. ట్వీట్‌లో... తెలిసిన విషయాల కంటే.. తెలియని విషయాలే ఎక్కువగా ఉంటాయి. అలాంటి విషయాలను సినిమాలో హోంబలే ఫిల్మ్స్, కంతరా సినిమాలో గొప్పగా చెప్పారు. కంతార సినిమా చూస్తుంటే రోమాలు నిక్క పొడిచాయి. రచయితగా, నటుడిగా, దర్శకుడిగా వ్యవహరించిన రిషబ్ శెట్టికి హ్యాట్సాఫ్. ఇండియన్ సినిమాలో మాస్టర్ పీస్ లాంటి సినిమాను అందించినందుకు టీమ్ మొత్తానికి కంగ్రాట్స్ అని రజినీకాంత్ ట్వీట్ చేశారు.

రజనీ సార్.. నేను మీ అభిమానిని..
రజనీకాంత్ ట్వీట్‌కు రిషబ్ శెట్టి స్పందిస్తూ ఎమోషనల్ అయ్యాడు. డియర్ రజనీకాంత్ సర్.. ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మీరు. నా చిన్నతనం నుంచి నేను మీకు అభిమానిని. మీ ప్రశంసలతో నా కల సాకారమైంది. స్థానికంగా ఉండే కథలను చేయాలనే స్పూర్తిని మీరే కలిగించారు. మీరు ఆడియెన్స్ ఒక స్పూర్తి. థ్యాంక్యూ సార్ అని రిషబ్ శెట్టి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు ఇవే..
ఇదిలా ఉండగా, కంతార చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఊహించని వసూళ్లను నమోదు చేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల వసూళ్లను సాధించింది. కన్నడలో 128 కోట్లు, హిందీలో 26.5 కోట్లు, తెలుగులో 24.1 కోట్లు, తమిళంలో 3.19 కోట్లు, మలయాళంలో 2.96 కోట్లు వసూలు చేసింది. ఇంకా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా కొనసాగుతున్నది.


Click it and Unblock the Notifications











