»   » రజనీ 'రోబో’కథ తనదే నంటూ తెలుగు రచయిత...

రజనీ 'రోబో’కథ తనదే నంటూ తెలుగు రచయిత...

Posted By:
Subscribe to Filmibeat Telugu

రజనీకాంత్ లేటెస్ట్ చిత్రం రోబోకు తన రాసిన 'మేన్‌ రోబో" కు బాగా దగ్గర పోలికలున్నాయని,వివరణ ఇవ్వాలని రచయిత విజయార్కె డిమాండ్ చేస్తున్నారు. రచయిత మాటల్లోనే.. నేను రెండు సంవత్సరాలు కష్టపడి 2002 లో రాసిన 'మేన్‌ రోబో" నవల హ్యూమన్ ఎమోషన్స్, ఇంటలెక్చువల్స్,ప్రేమ తదితర అంశాలతో ద్విపాత్రాభినయంతో నవల పబ్లికేషన్స్ ద్వారా విడుదల అయింది. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న రోబో చిత్రంలోని రోబో పాత్ర, ఇతర అంశాలు, కౌలాలంపూర్, హైదరాబాద్ లలో జరిగిన ఆడియో వేడుకల్లో శంకర్ మాట్లాడిన మాటలు,శంకర్ సొంత వెబ్ సైట్ లో చిత్ర కథ ధీమ్ గురించి చెప్పిన విషయాలు, హీరోయిన్ ఐశ్వర్య పేరు షర్మిల అని చెప్పటం ఇవన్నీ పరిశీలిస్తే నా నవలకు, ఈ చిత్రానికి చాలా దగ్గర సంభందం ఉందని అర్దమవుతోంది. వివరణ కోసం స్పష్టత ఇవ్వాలని ఇప్పటికే ఇ మెయిల్ చేసాను. అయినా దర్శకనిర్మాతలనుంచి ఎలాంటి స్పందన రాలేదు. నాకు వివరణ ఇవ్వకపోతే చిత్రం విడుదల వరకూ వేచి ఉండి ఆ తర్వాత స్పందిస్తాను. ముఖ్యంగా వారిని అడిగేది ఒక్కటే. నాకు కావాల్సింది వివరణ, కథలోని ఆత్మ ఒకటే అయితే దానకి సంభందించిన క్రెడిట్ కోరుకుంటున్నాను. ఇక రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ జంటగా శంకర్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న 'రోబో" చిత్రాన్ని సెప్టెంబర్ 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu