‘రోబో’ లో రజనీకాంత్ దోమల వేట!
సూపర్ స్టార్ రజినీకాంత్ ఏంటీ చీప్ గా దోమలను వేటాడటం ఏమిటని ఆలోచిస్తున్నారా? కాని ఇది నిజం రజినీకాంత్, ఐవ్వర్యరాయ్ కాంబినేషన్ లో ప్రముఖ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న 'రోబో" సినిమాలో రజినీకాంత్ చేసే పని ఇదే. 'రోబో" సినిమాకు సంబంధించిన స్టోరీ కాన్సెప్ట్ లీకైంది. 'రోబో" సినిమా స్టోరీకి సంబంధించి అందిన వివరాల ప్రకారం రజినీకాంత్, ఐశ్వర్య రాయ్ ప్రేమికులు. ఒక సందర్భంలో ఐశ్వర్య రాయ్ ని ఒక దోమ కుడుతుంది. దాంతో ఆదోమపై పగపెంచుకున్న రజనీకాంత్ దాన్ని వెతుక్కుంటూ దోమల లోకంలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలకు డైరెక్టర్ శంకర్ కాస్త మసాల జోడించి ఆసక్తి కరంగా తెరకెక్కించాడట. మరి రజనీకాంత్ వేటలో ఆ దోమను పట్టుకున్నాడా? ఆయన వేటాడింది దోమలనేనా?
ఇదొక ఎత్తైతే రజనీకాంత్ రోబోలో డ్యూయోల్ రోల్ పోషిస్తున్నారు. ఒకరు సైంటిస్ట్, మరొకరు రోబో, సైంటిస్టే 'రోబో" ను క్రియేట్ చేస్తాడు. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పని చేస్తుంది. మనుషుల్లా సిక్స్ సెన్స్ ఉంటుంది. మానావాళి ఉపయోగార్ఝం దేశ పురోభివృద్ది కోసం ఈ రోబోను క్రియేట్ చేస్తే అది కాస్తా ఐశ్వర్య పై మనసు పారేసుకుంటుంది. ప్రేమ గీతాలు రాస్తుంది. హీరోలా మంచు కొండల్లో డ్యూయెట్స్ పాడుకుంటుంది. దీని తెలివితేటలపై విలన్ల కళ్లు పడుతాయి. రోబోను తమ చెప్పు చేతల్లో ఉంచుకోవాలని చూస్తారు. ఈక్రమంలో సైంటిస్ట్ అయిన రజనీకాంత్ ఫైట్ చేసి రోబోను రక్షించడంతో కథ సుఖాంతం అవుతుంది. ఇలా రెండు విధాలుగా ఉన్న ఈ స్టోరిలైన్ కి అసలు 'రోబో" అని టైటిల్ ఎందుకుపెట్టారు? లాంటి ఆసక్తికర విషయాలు తెలియాలంటే సినిమా విడుదలయ్యేదాకా వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











