రజనీకాంత్ సూపర్ హిట్ చిత్రం 'రోబో' ఇక 'త్రీడీ' లో..
రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన "రోబో" చిత్రం భాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ ఆడియన్స్ కోసం త్రీడి ఫార్మెట్ లోకి మార్చాలని నిర్మాత కళానిధి మారన్ నిర్ణయించుకున్నారని సమాచారం. అలాగే ఈ త్రీడి చిత్రం మొదట ఇంగ్లీష్ లో విడుదల చేసి ఆ తర్వాత మార్కెట్ ని బట్టి భారతీయ భాషల్లోకి డబ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు కొన్ని తమిళ పత్రికలు రాస్తున్నాయి. ఇందునిమత్తం కొన్ని త్రిడి ఫార్మెట్ లోకి కన్వర్ట్ చేసే సంస్ధలతో చర్చలు జరుపుతున్నారని, ఇందుకు దర్శకుడు శంకర్ ప్రమేయం ఏమీ ఉండదని చెప్తున్నారు. అలాగే త్రిడి ఫార్మెట్ లోకి చేసేటప్పుడు కొంత లెంగ్త్ తగ్గించి ట్రిమ్ చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారని, అలాగే అదే త్రీడీ వెర్షన్ ఇండియాకు వచ్చేసరికి ఏడు నిమిషాల నిడివిగల ఫుటేజ్‌ను జోడిస్తారని చెప్పుతున్నారు. అంతా సవ్యంగా జరిగితే త్వరలోనే ఈ త్రీడి వ్యవహారం మొదలవ్వవచ్చు. ఖర్చు...డిమాండ్ అనే అంశాలు ప్రాతిపదికగా ఈ త్రీడి చిత్రం మొదలయ్యే అవకాశం ఉందని యూనిట్ వర్గాలు ధృవీకరిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











