తుడిచి పెట్టుకుపోయిన బాహుబలి 2 రికార్డ్.. రజని 2.0మానియా!

సూపర్ స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన 2.0 చిత్రం విడుదలకు ముందే రికార్డుల వేట మొదలు పెట్టింది. కళ్ళు చెదిరే గ్రాఫిక్స్, ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలతో వినోదాన్ని పంచడానికి నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు వారం రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఆసక్తికరమైన పోస్టర్స్ విడుదల చేస్తూ ఈ చిత్రంలో గ్రాఫిక్స్ తీవ్రత ఎలా ఉంటాయో చెబుతున్నారు. దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 2.0 చిత్రం కోసం అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తికతో ఎదురుచూస్తున్నారు.

విడుదలకు ముందే 120 కోట్లు

విడుదలకు ముందే 120 కోట్లు

2.0 చిత్రం మరే ఇండియన్ మూవీకి సాధ్యం కానీ రీతిలో విడుదలకు ముందే 120 కోట్లు రాబట్టేసింది. అడ్వాన్స్ బుకింగ్ రూపంలో విడుదలకు ముందే 100 కోట్లకు పైగా రాబట్టిన చిత్రంగా రజని 2.0 చరిత్ర సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా 2.0 భారీ స్థాయిలో విడుదలవుతుందని ట్రేడ్ విశ్లేషకులు ముందుగానే అంచనా వేశారు. అందుకు తగ్గట్లుగానే 2.0 మరో రికార్డ్ నెలకొల్పింది.

బాహుబలి 2 రికార్డ్ బ్రేక్

బాహుబలి 2 రికార్డ్ బ్రేక్

2.0 చిత్రం దేశవ్యాప్తంగా 6800 స్క్రీన్స్‌లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. దీనితో 2.0 చిత్రం ఇండియాలో అత్యధిక థియేటర్స్‌లో విడుదలవుతున్న చిత్రంగా రికార్డు నెలకొల్పింది. గతంలో బాహుబలి 2 పేరిట ఉన్న రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. బాహుబలి 2 చిత్రం ఇండియా మొత్తం 6500 స్క్రీన్స్ లో విడుదలైన సంగతి తెలిసిందే.

ఊహకందని విధంగా ఓపెనింగ్స్

ఊహకందని విధంగా ఓపెనింగ్స్

సూపర్ స్టార్ రజని, శంకర్ దర్శత్వం, అక్షయ్ కుమార్ విలక్షణ నటన.. ఇన్ని బలాలు ఉన్న 2.0 చిత్రం తొలి రోజు అదిరిపోయే ఓపెనింగ్స్ సొంతం చేసుకోవడం ఖాయం అని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా 2.0 భారీ విడుదలకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. దాదాపు 3000 మందికి పైగా టెక్నీషియన్లు ఈ చిత్రం కోసం పనిచేశారు.

వాయిదాకు కారణం

వాయిదాకు కారణం

2.0 చిత్రం గత ఏడాదే విడుదల కావాల్సింది. కానీ గ్రాఫిక్స్ రూపకల్పనలో జాప్యం జరగడంతో విడుదల వాయిదా వేయాల్సి వచ్చింది. విజువల్ వండర్ గా రూపొందితున్న ఈ చిత్రానికి గ్రాఫిక్స్ చాలా కీలకం కావడంతో శంకర్ ఎక్కడా రాజీ పడలేదు. మంచి నాణ్యతతో గ్రాఫిక్స్ వచ్చే వరకు విశ్రమించలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ స్టంట్ డైరెక్టర్స్ ఈ చిత్రానికి పనిచేశారు. హాలీవుడ్ విఎఫ్ఎక్స్ సంస్థలు విజువల్స్ అందించాయి.

రోబోతో సంబంధం లేదు

రోబోతో సంబంధం లేదు

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శంకర్ మాట్లాడుతూ ఆసక్తికర విషయం వెల్లడించాడు. కొన్ని ప్రధాన పాత్రలు మినహా రోబో చిత్రంతో 2.0కి ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తి భిన్నంగా ఉంటుందని శంకర్ తెలిపాడు. మొబైల్ ఫోన్ కు బానిస కావడం అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్న అక్షయ్ కుమార్ పాత్ర రూపొందించినట్లు తెలుస్తోంది. చిత్ర యూనిట్ విడుదల చేసే ప్రతి పోస్టర్ లో వికృత రూపంతో, శరీరం మొత్తం మొబైల్ ఫోన్స్‌తో అక్షయ్ కుమార్ కనిపిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X