twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీ రోబో2.0 మరో రికార్డు.. అక్కడ పరదాలు లేస్తున్నాయ్.. దుమ్మురేపడం ఇక ఖాయం..

    By Rajababu
    |

    Recommended Video

    రజనీ రోబో2.0 మరో రికార్డు.. దుమ్మురేపడం ఖాయం..

    సూపర్‌స్టార్ రజనీకాంత్, సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రానున్న రోబో2.0 చిత్రం మరో అరుదైన ఘనతను సాధించనున్నది. సౌదీ అరేబియా సినీ మార్కెట్లో విడుదలయ్యే తొలి భారతీయ చిత్రంగా రోబో2.0 చిత్రం రికార్డు సృష్టించనున్నది. సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్ చేపట్టిన సంస్కరణల్లో భాగంగా ఆ దేశంలో సినిమా హాళ్లను ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సౌదీ ప్రజలకు వినోద రంగం చేరువకానున్నది.

     1980 నుంచి నిషేధం

    1980 నుంచి నిషేధం

    1980 నుంచి సౌదీ అరేబియాలో సినిమాలు విడుదల కాకుండా నిషేదించారు. సినిమాల కారణంగా తమ సంస్కృతిపై మచ్చపడే అవకాశం ఉంది అనే కారణంతో అక్కడి మతపెద్దలు ఆంక్షలు విధించారు. అప్పటి నుంచి సౌదీలో సినిమాల ప్రదర్శనకు బ్రేక్ పడింది.

     సౌదీ రాజులో సంస్కరణల జోరు

    సౌదీ రాజులో సంస్కరణల జోరు

    తాజాగా సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ సంస్కరణలకు తెచ్చి వినోద రంగానికి పెద్ద పీట వేయాలని నిర్ణయం తీసుకోవడంపై భారతీయ సినిమా పరిశ్రమ.. ముఖ్యంగా తమిళ సినిమా పరిశ్రమ రేంజ్ భారీగా పెరిగే ఉంది. ట్రేడ్ అనలిస్టుల అంచనా ప్రకారం తమిళ చిత్రాల మార్కెట్ 25 శాతం మేర పెరిగే అవకాశం ఉంది.

    రాజ్ కపూర్‌ టూ షారుక్ ఖాన్

    రాజ్ కపూర్‌ టూ షారుక్ ఖాన్

    మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా దేశాల్లో భారతీయ చిత్రాలకు ఆదరణ ఎక్కువగా ఉంది. ఒకప్పుడు రాజ్ కపూర్ చిత్రాలంటే ఈజిప్టులో పడిచచ్చేవారు. ప్రస్తుతం షారుక్ ఖాన్‌కు కూడా మంచి ఆదరణ ఉంది. గల్ఫ్ ప్రాంతంలో ఎక్కువగా నివసించేది మలయాళీలు, తమిళులే. కాబట్టి తమిళ, మలయాళ చిత్రాలకు ఎక్కువ క్రేజ్ ఉండటానికి అవకాశం ఉంది.

     సౌదీలో మరిన్ని కలెక్షన్లు

    సౌదీలో మరిన్ని కలెక్షన్లు

    సౌదీ రాజు తీసుకొన్న నిర్ణయం ప్రకారం 2030 నాటికి ఆ దేశంలో థియేటర్ల సంఖ్యను 2 వేలకు పెంచాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో లైకా ప్రొడక్షన్ క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగం మాట్లాడుతూ.. హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో భారీ చిత్రాలు రూపొందడం వలన 30 శాతం బడ్జెట్ పెరిగింది. ఒకవేళ సౌదీ అరేబియాలో మార్కెట్ ఓపెన్ అయితే మరింత రెవెన్యూ రాబట్టడానికి అవకాశం ఉంటుంది.

    English summary
    Reforms being spearheaded by Crown Prince Mohammad Bin Salman – that has even permitted women to drive vehicles – the Tamil movie mandarins feel that their market in West Asia can go up by 25 per cent. With theatres all set to open in Saudi Arabia in March – and with 2000 screens planned by 2030. Rajinikanth’s 2.0 is likely to be the first major south Indian movie to open in the Saudi Arabian market, and is likely to release in Hindi, Tamil and Telugu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X